Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతి ఇచ్చారు.. కేసు నమోదు చేశారు
- రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు
- కేసులను ఉపసంహరించుకోవాలి
- కమ్యూనిస్టు నాయకుల డిమాండ్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజాసామానికి గొడ్డలిపెట్టుగా పోలీసుల తీరు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ(ఎం) చేపట్టిన జన చైతన్య యాత్ర సభను సాకుగా చూపి కమ్యూనిస్టు నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. ఈనెల 26న మిర్యాలగూడ వచ్చిన జన చైతన్య యాత్రకు విశేష స్పందన రావడం, సభలు మిర్యాలగూడ నుంచి సీపీఐ(ఎం) పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర ప్రకటించడంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడడం లేదు. బైకు ర్యాలీ సభకు పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ సభ రోడ్డుపై పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగించారని సాకు చూపి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ పై 188, 314 సెక్షన్ల కింద టూ టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి అక్రమ కేసు బనాయించారు. ఈ విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న కమ్యూనిస్టు నాయకులు పోలీసుల తీరుపై భగ్గుమంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని అనుమతి తీసుకొని ర్యాలీ సభ నిర్వహించుకుంటే దానిని జీర్ణించుకోలేక కొందరి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు కమ్యూనిస్టు నాయకులపై అక్రమ కేసు ఆరోపిస్తున్నారు. కమ్యూనిస్టు నాయకులకు కేసులు కొత్తేమి కాదని, అక్రమ కేసులతో నాయకులు భయపడరని తేల్చి చెబుతున్నారు. పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కమ్యూనిస్టు నాయకులతో పాటు ప్రజా సంఘాల బాధ్యులు స్వచ్ఛంద సంస్థలు మేధావులు, పేద వర్గాల వారు డిమాండ్ చేస్తున్నారు.