Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
ఇటీవల నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా ఎన్నికైన మాజీ మున్సిపల్ చైర్మెన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్ తల్లి దొంతగాని లక్ష్మమ్మను బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన కంఠమహేశ్వర స్వామి దేవస్థానంలో గౌడ యువజన సంఘం అధ్యక్షుడు,బీఆర్ఎస్ పట్టణ ప్రధానకార్యదర్శి బెల్లంకొండ అమర్ ఆధ్వర్యంలో సన్మానించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నాయకులు మాట్లాడుతూ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని హుజూర్నగర్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్కుగాను మున్సిపల్ చైర్మెన్‌గా నేడు తన భార్య పద్మ కౌన్సిలర్‌గాను అదేవిధంగా తన తల్లి దొంతగాని లక్ష్మమ్మను మార్కెట్చైర్మెన్గా ఎదిగేవిధంగా కషి చేసిన దొంతగాని శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి కతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల చెందిన గౌడ సంఘం నాయకులు బెల్లంకొండ రామజోగి, కల్లుగీత పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు వల్లపుదాసు కష్ణ,ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బెల్లంకొండ రామచందర్, ఐఎన్టీయూసీ జాతీయ నాయకుడు, దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు ఎరగాని నాగన్న గౌడ్,నాయకులు దొంతగాని సత్యనారాయణ,తండు సాయిరాంగౌడ్, పండ్ల హుస్సేన్,పులిగోవింద్, దొంతగాని రమేశ్, కుక్కడకు నర్సింహారావు, బెల్లంకొండ ఉపేందర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు పండ్ల నాగరాజు, కోల మట్టయ్య, కోలా శ్రీనివాస్, కాకి శ్రీనివాస్,బత్తిని మల్లయ్య, రామకష్ణ,ఎలక వెంకటేశ్వర్లు,బెల్లంకొండ శ్రీను పాల్గొన్నారు.