Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
బీఆర్ఎస్ చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలతో కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు మధ్య బంధం బలపడుతుందని రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్, జిల్లా పరిశీలకులు మెట్టు శ్రీనివాస్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం మండలపరిధిలోని సిరికొండ గ్రామంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అధ్యక్షతన మండల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకుల పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారన్నారు.బీఆర్ఎస్ ఏర్పడిన ఎనిమిదేండ్లకాలంలో ప్రజల కష్టనష్టాలు పోయి సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారన్నారు.గతంలో రైతులకు వ్యవసాయ పెట్టుబడులు లేక దళారుల చేతుల్లో దగపడే వారన్నారు.కేసీఆర్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం ఎకరానికి సంవత్సరానికి రూ.10,000 పెట్టుబడిగా సాయం అందించి రైతులును ఆదుకుంటుందన్నారు.కేసీఆర్ ఒక మేనమామగా ఆడపడుచులకు కల్యాణలక్ష్మీ,షాదీముబారక్ చెక్కులను అందజేసి రుణం తీర్చుకుంటున్నారన్నారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలఅధ్యక్షులు శీలంసైదులు, ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మెన్లు కొండపల్లి వెంకటరెడ్డి, ముప్పాని శ్రీధర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షులు పొనుగోటి నర్సింహారావు,ఎంపీటీసీలఫోరం మండలఅధ్యక్షులు కాంపాటివెంకన్న మాజీ జెడ్పీటీసీ శీలం ఉమా,మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి పాల్గొన్నారు.