Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేళ్లచెర్వు
మండలంలోని కందిబండ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం నూతన భవనం, గోదాములను హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి బుధవారం ప్రారంభించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కందిబండ గ్రామంలో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం భవనం, గోదాంను నిర్మించుకోవడం సంతోషకరమన్నారు.గత ప్రభుత్వాల కాలంలో చాలా ప్రాథమికవ్యవసాయ సహకార సంఘాలు మూతపడ్డాయన్నారు.తెలంగాణ సాధించుకున్నాక బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో పీఎసీఎస్‌లకు మహర్దశ వచ్చిందన్నారు.రైతే రాజుగా రైతుల రాష్ట్రంగా, రైతుల ప్రభుత్వంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.ప్రక్క రాష్ట్రాలే కాకుండా పక్క దేశాలు కూడా మన తెలంగాణ వైపు చూస్తున్నా యన్నారు.తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రైతుబీమా, రైతుబంధు పథకాలను ప్రపంచమంతా కొనియాడుతుందని తెలిపారు. రైతు రుణాలందించడంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.మేళ్ళచెర్వు మండలంలో సీసీరోడ్లు, డ్రయినేజీలు ఏర్పాటుచేశామన్నారు.గత పాలకులు నిర్మించిన లిప్టులు ఒకటి రెండేండ్లకు మించి పనిచేయలేదని కానీ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా లిప్టులు మంజూరు చేసిందని, దానితో చివరి ఆయకట్టు వరకు నీరు చేరుతుందని తెలిపారు.ఎమ్మెస్సీ పథకం ద్వారా నాబార్డ్ వారి ఆర్థిక సహాకారంతో రూ.72 లక్షల వ్యయంతో 750 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును నిర్మించుకున్నామన్నారు.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్లు వేగులూరి రంగాచారి, దొండపాటి అప్పిరెడ్డి, ఎన్డీసీఎంఎస్ డైరెక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మెన్ పత్తిపాటి రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్‌చైర్మెన్ కన్నెబోయిన లావణ్యశ్రీనివాస్, పీఎసీఎస్ సీఈఓ బాలెబోయిన పవన్‌కల్యాణ్, ఎంపీపీ కొట్టే పద్మసైదేశ్వరరావు, జెడ్పీటీసీ శాగంరెడ్డి, పద్మగోవిందరెడ్డి, ఇమ్రాన్, గాయం గోపిరెడ్డి, పుష్ప కృష్ణారెడ్డి, బొల్లేపల్లి అంజయ్య, తోట వెంకటనారాయణ, పెద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు.