Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమావేశాలను బైకాట్ చేసిన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం
- పట్టణం శరవేగంగా అభివద్ధి చైర్మెన్ మందడి సైదిరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ 2023-24పురపాలక వార్షిక బడ్జెట్‌కు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి అధ్యక్షతన వార్షిక బడ్జెట్ జరిగింది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు బై కాట్ చేశారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్ రూ.784.86 కోట్లు రూపొందించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బడ్జెట్ అంచనా వ్యయం పెరగడంతో అధికార పార్టీ కౌన్సిలర్లు సంతోషం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నుండి రూ7.1 కోట్లు, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ పట్టణ ప్రగతి ద్వారా రూ.7.1 కోట్లు, రోడ్లు గ్రాండ్స్ ద్వారా రూ 50 లక్షలు, స్వచ్ఛభారత్ స్వచ్ఛ తెలంగాణ కింద రూ 2.50 కోట్లు, సీఎం భరోసా నిధులు రూ.294 కోట్లు, అమత సిటీ కింద రూ.272 కోట్లు వస్తాయని అంచనా బడ్జెట్లో పొందుపరిచారు. వివిధ పన్నుల రూపంలో మున్సిపాలిటీకి రూ.60 కోట్లు, వస్తాయని అంచనా వేశారు. 2024 ప్రారంభ నిలువ 10 కోట్ల 10 లక్షలు అంచనా వేశారు. ఈ వార్షిక సంవత్సరం క్యాపిటల్ ఆదాయం రూ.719.23 కోట్లు ఉండగా క్యాపిటల్ వ్యయం రూ.539.63 కోట్లు బడ్జెట్లో పొందపరిచారు. ఉద్యోగుల వేతనాలకు రూ1.10 కోట్లు, ఔవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు రూ.19.03 కోట్లు, బ్లీచింగ్ పౌడర్‌కు రూ.35 లక్షలు, పారిశుద్ధ్య ఖర్చులు రూ.35 లక్షలు, ఆయిల్ ఖర్చులు 45 లక్షలు, వాహనాల ఇన్సూరెన్స్‌కు 35 లక్షలు, వీధి దీపాల విద్యుత్ నిర్వహణ ఖర్చులు రూ2.52 కోట్లు, నీటి వినియోగ విద్యుత్ నిర్వాహణ చార్జీలు రూ.6.60 కోట్లుగా బడ్జెట్లో పొందపరిచారు.ఈ స ంవత్సరం పెంచిన బడ్జెట్‌కు అనుగుణంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించాలని ఆయా వార్డుల కౌన్సిలర్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మెన్ మాట్లాడుతూ గత సంవత్సరం నల్లగొండ మున్సిపాలిటీ బడ్జెట్ 104 కోట్లు ఉంటే ఈ సంవత్సరం బడ్జెట్లో 784.86 లక్షల బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. ఈ అంచనా బడ్జెట్ మున్సిపల్ చరిత్రలో పెద్ద బడ్జెట్ అని అభివర్ణించారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నల్లగొండ పట్టణం శరవేగంగా అభివద్ధి సాధిస్తుందని తెలిపారు. అదరపు కలెక్టర్ ఖుష్భు గుప్తా మాట్లాడుతూ పట్టణ అభివద్ధికి అధికారులు సమన్వయంతో పని చేస్తూ భాగస్వాములు కావాలన్నారు. పట్టణంలో జరిగే అభివద్ధికి పనులకు ప్రజా ప్రతినిధులు సహకరించి, ప్రజలకు తోడుపాటును అందించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కేవీ. రమణ చారి మాట్లాడుతూ పట్టణం మరింత అభివద్ధి చెందాలంటే ప్రజలు ఆయా విభాగాల్లోని పన్నుల రుసుమును చెల్లించి పట్టణ అభివద్ధికి సహకరించాలని తెలిపారు. వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్‌గౌడ్ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ రుసుములను తగ్గించాలన్నారు. పట్టణంలో ఉన్న మున్సిపల్ క్వార్టర్స్‌లను సరైన లబ్ధిదారులకు అందే విధంగా అధికారులు చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.