Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నతెలంగాణ -రాజాపేట
మండలంలోనిరఘునాథపురం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైనటువంటి చెక్కులను లబ్దిదారులకు గురువారం స్థానిక సర్పంచ్ గాడి పల్లి శ్రవణ్ ఆధ్వర్యంలో అందజేశారు. బబ్బురి చంద్రకళకు రూ. 60వేల ఎలగందుల సత్యనారాయణకు రూ.40వేల భీమ గాని లక్ష్మీకి 45వేల, కల్లూరు ఉపేందర్ రెడ్డికి రూ.60వేలు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు కృషి చేసిన ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి ఎల్లవేళల రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాగిర్తి రాజిరెడ్డి, యువజన నాయకులు పల్లె సంతోష్ గౌడ్, ఉపసర్పంచ్ పల్లె ప్రవీణ్ ,వెంకటేశం, కటకం స్వామి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.