Authorization
Sat April 05, 2025 04:35:00 am
నవతెలంగాణ -మోతే
బీఆర్ఎస్ చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలతో కార్యకర్తలకు ప్రజలకు నాయకులకు మధ్య బంధం బల పడుతుందని రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్్ జిల్లా పరిశీలకులు మెట్టు శ్రీనివాస్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు .బుధవారం మండల పరిధిలో సిరికొండ గ్రామంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకుల పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు బి ఆర్ఎస్ వచ్చిన ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రజల కష్టనష్టాలు పోయి సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు గతంలో రైతులకు వ్యవసాయ పెట్టుబడులు లేక దళారుల చేతుల్లో దగపడే వారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం, రైతు బంధు, ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ చెక్కులను అందజేసి రుణం తీర్చుకుంటున్నారన్నారు. వృద్ధులకు, అనాథలకు ఒంటరిమహిళలకు, వికలాంగులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ ఫలాలు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అందుతున్నాయన్నారు. దళితులకు దళిత బంధు పదిలక్షల రూపాయలు అందించి వారి సంక్షోమానికి కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్గ పోరుతో సతమతమవుతుందని, బీజేపీి దేశంలో కులమత బేధాలతో ప్రజలను చీల్చుతుందన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు శీలం సైదులు, ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్లు కొండపల్లి వెంకటరెడ్డి, ముప్పాని శ్రీధర్ రెడ్డి ,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పొనుగోటి నరసింహారావు, ఎంపీటీసీల పోరం అధ్యక్షులు కాంపాటీ వెంకన్న, మాజీ జడ్పిటిసి శీలం ఉమా, మాజీ ఎంపీపీ ఆరే లింగారెడ్డి ,సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.