Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలయానికి రూ.50వేల విరాళం ప్రకటించిన సుధాకర్ పీవీసీ ఎండి మీలామహదేవ్
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలోని శాంతి నగర్లో శ్రీ అభయాంజనేయ స్వామి ,శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో గురువారం శ్రీ సీత రాముల వారి కళ్యాణం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ పీవీసీఎండి మీలా మహదేవ్ గుడి కలర్స్ నిమిత్తం రూ. 50వేలు విరాళం గా ప్రకటించారు. సీతారాముల కళ్యాణాన్ని ఆలయ కమిటీ సభ్యులు కొత్త రామనర్సయ్య -ఆండాళ్ళు ,కొత్త పవన్ నాగభార్గవి ,బిక్కుమ్మళ్ల రాఘవేందర్ అనిత,దంపతులు కుటుంబ సభ్యులు గా వ్యవహరించి కళ్యాణాన్ని కి పట్టు వస్త్రాలు , ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గుడి పూజారులు ఉపేందర్ ,వెంకన్న ,భక్తులు ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్ ,బైరు నాగరాజు ,మేడి నాగరాజు ,పాండురంగా చారి ,బిక్కుమళ్ల పుష్పవతి, భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
కాల్యాణోత్సవంలో.. మాజీమంత్రి దామోదర్ రెడ్డి
పట్టణంలోని శ్రీరాం నగర్ లోని బ్రాహ్మణ కళ్యాణ మంటపం లో బ్రాహ్మణ సేవా సమాజం అధ్యక్షుడు చకిలం రాజేశ్వర రావు ఆద్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సూర్యాపేట నియోజకవర్గ రాంరెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ ప్రముఖులు డాక్టర్ రామయ్య, ఆకునూరు పాండురంగారావు, టేకులపల్లి శ్రీనివాస రావు, కట్టెకోల పూర్ణచందర్ రావు, బంధకవి కృష్ణ మోహన్, ఆదుర్తి రమేష్, అక్కిరాజు దుర్గా ప్రసాద్, తడకమళ్ళ కృపాకర్ రావు, కట్టెకోల శ్రీమన్నారాయణ, కోటంరాజు వేంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి:సీతారామచంద్రస్వామి కృపతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వమే రావాలని కోరుకున్నట్లు సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపిక యుగంధర్ రావు తెలిపారు.గురువారం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయం ఆవరణలో నూతన కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణమహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కళ్యాణ మండపానికి 12 లక్షల నిధులు మంజూరు చేసిన ఘనత ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్కే దక్కిందని కొనియాడారు. ఆలయ అర్చకులు రామాచార్యులు మాట్లాడుతూ ఆలయ చైర్మెన్‌్ ముత్యాల వెంకన్న అడగగానే స్థానిక ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయఅర్చకులు శేషు శర్మ,ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్,డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్,గోపగాని శ్రీను,ఓరుగంటి సత్యనారాయణ, బండారు దయాకర్, కాసం మల్లయ్య, ఓరుగంటి దీప్తి శ్రీనివాస్,బండారు వీణ వినరు కుమార్, తల్లాడ కేదారి, తల్లాడ సూర్యకళ, పోలవరపు సరస్వతి,అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన గాజుల లక్ష్మణ్- కీర్తి దంపతుల (హియా ఇన్ఫ్రా డెవలపర్స్) ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్ ముత్యాల వెంకన్న మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మహాదానముని అన్నారు.అన్నదానం చేసిన దంపతుల దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సన్మానించారు.
మద్దిరాల : మండలంలోని రెడ్డిగూడెం లో శ్రీ సీతారామ ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కళ్యాణాన్ని మారేల్లి రవి దంపతులు (సీత),ఆరునూర్ల వెంకన్న దంపతులు (రాముడు)(కుక్కడం) నిర్వహించారు. అనంతరం గ్రామ దేవాదాయ కమిటీ భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందిచారు. సాయంత్రం భక్తుల దర్శనార్థం గ్రామ వీదులగుండా శ్రీ సీతారాముల స్వామి వారిని ఊరేగింపు గా డప్పు వాయిద్యాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బరపటి ఉపేందర్,ఎంపిటిసి శ్రీలత శ్రవణ్ కుమార్,జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ దుగ్యాల రవీందర్ రావు, దేవాలయం కమిటీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు రేటినేని వెంకటయ్య,తాందారీ ప్రతాప్ గౌడ్,కమిటీ సభ్యులు దుగ్యాల కిషన్ రావు, బెడద వెంకన్న,మారెళ్లి యాకయ్య, దగ్గుల రమేష్,జక్కుల శ్రవణ్, గ్రామ పెద్దలు నల్లాని సోమేశ్వర రావు, చాపల వెంకన్న, దగుల వెంకన్న మల్లయ్య,యాకయ్యా సందీప్, రేటినేని జెన్నయ్య, పెద్ది శ్రీనివాస్ అధిక సంఖ్యలో మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి : శ్రీరామనవమి సందర్భంగా మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం సీతారామచంద్ర నవరోత్సవాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య, దీన్ దయాల్ ,మూల వెంకటరెడ్డి కొండ సోమయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కోమ్మినేని స్రవంతి సతీష్ కుమార్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు నరేష్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరు : మండల వ్యాప్తంగా 17 గ్రామాలలో శ్రీరామ నవమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించుకున్నారు. మండలంలోని అన్ని రామాలయ ఆంజనేయ స్వామి దేవాలయాలలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు .సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం అన్ని గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.
మోతే : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణం వేద పండితుల నడుము కమనీయంగా నిర్వహించారు. .ఈ వేడుకల్లో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి ,బీిఆర్‌ఎస్ మాజీ ఇన్చార్జి కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి ఎంపీపీ ముప్పాని ఆశా శ్రీకాంత్ రెడ్డి ,జెడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు ,విద్యుత్తు డి ఈ నిమ్మ వెంకట కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ,ి్డ సర్పంచులు తండు యాదమ్మ మల్సూరు ,గుండాల గంగులు మామిడి స్వాతి, ఎంపీటీసీ మద్ది మధు పాల్గొన్నారు
కోదాడరూరల్: పట్టణ పరిధిలో రెండో భద్రాద్రిగా పేరొందిన తమ్మర గ్రామంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఎదుర్కోలు కార్యక్రమాన్ని గురువారం కన్నుల పండువగా నిర్వహించరు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా వేద పండితులు ఆలయ ప్రాంగణంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కళ్యాణ మండపంలో ఉంచి స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొని గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిి కూడా పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ కనగాల శ్రీధర్, కోదాటి కృష్ణయ్య, కమతం వెంకటయ్య, కోదాటి వెంకటేశ్వర్లు, నిడికొండ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ :మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణాన్ని గురువారం ఆయా పురోహితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణం చూపరులకు కనువిందు చేయగా, భక్తుల రాకతో ఆలయాలు కిక్కిరిశాయి. కాగా ఆయా గ్రామాల్లోని రామాలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలను ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మొదటగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆలయాల వద్దకు తరలించి పురోహితులు ఇరువంటి వెంకటరమణశర్మ, సత్యనారాయణశర్మ, భాస్కరశర్మ, చంద్రయ్య, రామయ్య, మురళీశర్మలతో పాటు మరికొందరు పురోహితులు ఆయా గ్రామాల్లోని రామాలయాల్లో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు మొదటగా పట్టువస్త్రాలను అలంకరింపచేసి, భాజాభజంత్రీల నడుమ ప్రత్యేక భజనలతో, మహిళ కోలాటాలతో పీటలపై కూర్చున్న పుణ్యదంపతుల చేత ఈ కల్యాణాన్ని పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం-స్వరూప, జెడ్పీటీసి మామిడి అనితఅంజయ్య దంపతులు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు భక్తులు ప్రజలు పాల్గొన్నారు.
హుజూర్నగర్ :పట్టణంలోని రామాలయంలోనూ గోవిందపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో, కొత్త బస్టాండ్ సమీపంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని నవమి వేడుకల్లో పాల్గొన్నారు. గోవిందపురంలో జిల్లా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమనాథరెడ్డి పాల్గొనగా పట్టణ ప్రజలతో పాటు వివిధ రాజకీయ పక్షాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు దేవస్థానాలు కమిటీ వారు ప్రజలు ఆయా దేవాలయాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వేడుకలు నిర్వహించారు.
నాంపల్లి : గురువారం శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా నాంపల్లి మండలంలో వివిధ గ్రామాలలోని దేవాలయాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పసునూరు గ్రామంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి స్వర్ణలత దంపతులు పాల్గొని సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. తిరుమలగిరి గ్రామంలో రామస్వామి గుట్టపై రామాలయంలో, మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో, గట్ల మల్లేపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో, పెద్దాపురం గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆయా గ్రామాలలో పెద్ద ఎత్తున పాల్గొని డప్పు చప్పులతో, కోలాటాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్ని గ్రామాలలో దాతలు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, ఏడుదొడ్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుమ్మడపు నర్సింహరావు, సర్పంచులు ఏరెడ్ల సంజీవరెడ్డి, పోగుల దివ్య, రాపోతూ దేవేంద్ర సత్యనారాయణ, జెల్లెల్ల యాదమ్మ సైదులు, నాగులవంచ శ్రీలత, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతిరెడ్డి, పూల వెంకటయ్య, పల్లె రామలింగం తదితరులు పాల్గొన్నారు.
కేతపల్లి :గ్రామాలలో ప్రజలు శ్రీరామనవమి వేడుకలు గురువారము భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మండలంలో ఉన్న వివిధ గ్రామాలలోని రామాలయంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపాల వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ వేడుకలలో ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయాల వద్ద భక్తులకు అన్నదాన కానకం తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. మండలంలోని బండపాలెం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. స్వామివారిని ఎదుర్కోలు కోలాటం భజనలతో కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల సర్పంచులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : శ్రీరామనవమి సందర్భంగా గురువారం కొండమల్లేపల్లి పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నందు సీతారాముల కళ్యాణ మహౌత్సవ వేడుకలను వేదమంత్రాలు చదువుతూ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల విగ్రహాలకు నూతన పట్టు వస్త్రాలను బంగారు ఆభరణాలు అలంకరించి ముత్యాల తలంబ్రాలు పోయిస్తూ ఘనంగా కళ్యాణ మహౌత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ నాయిని మాధవరెడ్డి, సర్పంచ్ కుంభం శ్రీనివాస్‌గౌడ్, కేసాని లింగారెడ్డి, చంద్ర ధనంజయ, బుచ్చిరెడ్డి, నీలం లక్ష్మయ్య, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : శ్రీరామ నవమి సందర్బంగా గురువారం మండలంలోని వివిధ గ్రామాలలో జయజయరామా జగదభిరామ నామ స్మరణతో రామాలయాలు మారుమో గాయి. ఆయా గ్రామాల సర్పంచులు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణల,భక్తుల జయ జయ ద్వానాల నడుమ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. పుర ప్రజలు కళ్యాణ వేడుకలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి,భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామా సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ :నందికొండ మున్సిపాలిటీ కేంద్రం పైలాన్ కాలనీలోని కోదండరామలయంలో శ్రీరామనవమి సందర్బంగా సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వైభవంగా వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా జరిపించారు. ఈ శ్రీ రాముని కళ్యాణం సందర్భంగా నందికొండ మున్సిపాలిటీ చైర్మెన్ కర్ణ అనూష శరత్‌రెడ్డి దంపతులు సీతారాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అనంతరం నిర్వహించిన అన్నదానంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. స్వామి వారి కళ్యాణంలో జెన్కో సీఈ మంగేష్ నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.