Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ బండారు దత్తాత్రేయ
నవతెలంగాణ-కేతపల్లి
దేశంలో యువతను పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల నుండి యువతను, దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణానికి ముఖ్యఅతిథిగా హాజరై తిరిగి హైదరాబాదు వెళుతూ కేతపల్లిలో బీజేపీ జిల్లా నాయకురాలు అయితగోనిత నివాసంలో కాసేపు ఆగి పరామర్శించారు.. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ దేశంలో మాదకద్రవ్యాలు, మధ్యము ప్రజలను పట్టిపీడిస్తూ కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు మాదకద్రవ్యాలను నిషేధించి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అయితగోని అనిత, నాయకులు చెరుకు రోశయ్య, తాడోజి నరసింహచారి, విజయలక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి, వర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.