Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనానికి స్పందన
నవ తెలంగాణ -రామన్నపేట
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఈనెల 28న మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ అయి త్రాగునీరు వృధాగా పోవడంతో ఈనెల 29న నవతెలంగాణ లో మిషన్ భగీరథ మంచినీరు నేలపాలు అనే శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన ఆ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన బుధవారం మరమ్మతు పనులు నిర్వహించారు. పైప్లైన్ లీకేజ్ అయిన ఈ ప్రాంతంలో కొమ్మాయిగూడెం గ్రామానికి మంచినీటి సరఫరాకు టి ఏర్పాటు చేశామని పైప్ లైన్ లో నీరు ప్రెషర్ గా వస్తున్న సందర్భంలో ఇక్కడ ఒత్తిడి పెరిగి తట్టుకోలేక ఒక్కొక్క మారు పైపులు పగిలిపోవడం, లీక్ అవ్వడము జరుగుతుందని ఆ శాఖ అధికారులు తెలిపారు.