Authorization
Sat April 05, 2025 05:43:21 am
- ఇవ్వాలని ధర్నా
నవతెలంగాణ -ఆలేరుటౌన్
అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని కోరుతూ కౌన్సిలర్ శమంతారెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తుదారులు శుక్రవారం తహసీల్దార్‌కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇండ్లు రాని మహిళలు తహసీల్దార్ రామకృష్ణతో వాగ్వివాదానికి దిగారు. తహసీల్దార్ మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తహసీల్దార్‌కు తిరిగి మరోసారి మహిళలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, గ్రంథాలయాల డైరెక్టర్ బాలస్వామి, తునికి దశరథ,పత్తి వెంకటేష్,మొర్తాల రమణారెడ్డి పాల్గొన్నారు.