Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
కార్యకర్తలే బీఆర్ఎస్కు బలమని, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో చర్చకి తీసుకెళ్లాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 12 (అనాజిపురం, నాగిరెడ్డిపల్లి, నందనం, బొల్లెపల్లి , సూరపల్లి , ఆకుతోట బాయి తండా, పచ్చర్ల బోర్డు తండా, రెడ్డి నాయక్ తండ,ఎర్రంబ్ పల్లి,నమత్ పల్లి, తొక్కపురం,సిరి వేణి కుంట) గ్రామాలకు చెందిన కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యేశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతి పల్లెకి అభివృద్ధి, ప్రతి ఇంటికి ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలన్నారు.ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని కార్యకర్తలకు అర్ధమయ్యే విధంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ డాక్టర్ జడల అమరేందర్, భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పిటిసి సూబ్బురు భీరు మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మెన్ రాజేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ రమేశ్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య సింగిల్ విండో చైర్మెన్ పరమేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ అతికము లక్ష్మీనారాయణ, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జక్కా కవిత రాఘవేందర్ రెడ్డి, నందనం సర్పంచ్ కడమంచి ప్రభాకర్, సిరివెనీకుంట సర్పంచ్ పడాల అనిత వెంకటేష్, ఎర్రంబెల్లి సర్పంచ్ గాదె యశోద, తుక్కపురం సర్పంచ్ నోముల పద్మ మహేందర్ రెడ్డి, ఆకుతోట భాయి సర్పంచ్ చక్రమ్మ, రెడ్డి నాయక్ తండ సర్పంచ్ మంజు నాయక్, పచ్చర్ల బోర్డు తండా సర్పంచ్ రెడ్డి నాయక్, సూరపల్లి సర్పంచ్ బొడ్డు లక్ష్మి, చందుపట్ల సింగిల్ విండో మాజీ చైర్మన్ బలుగూరి మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, మండల అధ్యక్ష, కార్యదర్శులు జనగాం పాండు, నీలఓం ప్రకాష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.