Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మఠంపల్లి
కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తూ దేశ సంపదను అంబానీ,అదానీలకు బీజేపీ ప్రభుత్వం కట్టబెడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు అన్నారు.శుక్రవారం సీఐటీయూ,రైతు సంఘం, వ్యవసాయకార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జీపు ప్రచారజాతా మండలానికి చేరుకున్న సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిందన్నారు. గ్రామీణ పేదలు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే భాగంగా ప్రతి ఏటా బడ్జెట్లో పెద్దఎత్తున నిధుల కోతపెడుతుందన్నారు.పెట్రోల్,డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ చట్టాల పేరుతో కార్మిక వర్గం సాధించుకున్న అనేక హక్కుల్ని ప్రభుత్వం కాలరాసే విధంగా పార్లమెంట్లో చట్టాలు చేసిందని, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి అబాసు పాలయిందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం. రాంబాబు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లె వెంకట్‌రెడ్డి,గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు బాలునాయక్, రాష్ట్ర నాయకులు పాండు నాయక్ ,సిఐటియు జిల్లా నాయకులు శీలం శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోషణ బోయిన హుస్సేన్,సీఐటీయూ మండల నాయకులు షేక్ రణమియా, రైతు సంఘం నాయకులు షాగం శెట్టి జగన్మోహన్రెడ్డి, నాయకులు కంటు కోటయ్య, పొదిల సైదులు, పొడి శెట్టి రాము ,మైసయ్య, దేవుల ,చల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
మేళ్ళచెర్వు : చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారజాతా మండలానికి చేరుకుంది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యాక్షులు శీలం శ్రీను, పోసనబోయిన హుస్సేన్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వట్టెపు సైదులు, ప్రజా సంఘాల మండల నాయకులు, గుండు సైదులు, అంజి, ఆదినారాయణ, ఉప్పలమ్మ, కామేశ్వరి, కోటమ్మ, పాలెల్లి వెంకటేశ్వర్లు, నరేష్, ఉపేందర్, వేణు పాల్గొన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ
హుజూర్‌నగర్‌టౌన్:కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మట్టిపల్లి సైదులు అన్నారు.సీఐటీయూ, రైతుసంఘం, వ్యవసాయ కార్మికసంఘాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న జీపు ప్రచారజాతా శుక్రవారం హుజూర్‌నగర్‌కు చేరుకుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయిందన్నారు.సంవత్సరానికి కోటి ఉద్యోగాలని ప్రయివేటీకరణ పేరుతో లక్షలాది ఉద్యోగాలను ఊడగొట్టారన్నారు.నల్లధనం వెలికితీత పేరుతో నోట్ల రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం అంతకంటే పెద్దనోట్లను ముద్రించి అవినీతికి పెద్దఎత్తున తెర లేపిందని విమర్శించారు. అనేక దశాబ్దాల పాటు గ్రామీణ పేదలు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీచట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రతిఏడాది బడ్జెట్లో పెద్దఎత్తున నిధులకోత విధిస్తున్నారని విమర్శించారు.పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు.లేబర్చట్టాల పేరుతో కార్మికవర్గం సాధించుకున్న అనేక హక్కుల్ని ప్రభుత్వం కాలరాసే విధంగా పార్లమెంట్లో చట్టాలు చేసిందన్నారు.ఈనెల 5న ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి, శ్రీరాములు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాంబాబు, రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, రైతుసంఘం జిల్లా సహాయకార్యదర్శి దుగ్గి బ్రహ్మం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను, వ్యవసాయకార్మికసంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసనబోయిన హుస్సేన్, చిన్నం వీరమల్లు, పాశం వెంకట్‌నారాయణ, సాంబయ్య, పంగా వెంకటి, మైలవరపు అర్జున్‌రావు,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : ఏప్రిల్ 5వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడకు వచ్చిన కార్మిక సంఘాల ప్రచార జాతా కు స్వాగతం పలికి మాట్లాడారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక విధానాలను వ్యతిరేకించాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు తిప్పికొట్టాలని 5వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమానికి వేలాదిగా తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి కోటగిరి వెంకటనారాయణ, సీఐటీయూ పట్టణ కార్యదర్శి ఎం.ముత్యాలు,సీఐటీయూ సీనియర్ నాయకులు జుట్టుకొండ బసవయ్య, దాసరి శ్రీనివాస్, గంట నాగరాజు, మన్యం లింగయ్య, ఎం.వెంకటేశ్వర్లు, సైదులు, వెంకన్న, రాములు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేకి మోడీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం
పెన్‌పహాడ్ : ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు అన్నారు.సీఐటీయూ, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జీపు ప్రచారజాతా మండలానికి చేరుకుంది.ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.కేంద్రప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఈనెల 5న ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాంబాబు, సీఐటీయూ మండల కన్వీనర్ రణపంగ కృష్ణ, వ్యవసాయకార్మిక సంఘం మండల కార్యదర్శి గుంజ వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీను, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.