Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
ధ్యానంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుందని,తద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.శ్రీరామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో పోలీసు నియామక ఉచిత శిక్షణలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుక్రవారం స్థానిక అంతటి విజరు గార్డెన్ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేసిన ధ్యాన శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు.ధ్యానం, మెడిటేషన్ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నారు.ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటామని సంతోషంగా ఉంటామని తెలిపారు.జ్ఞాపకశక్తి మెరుగుపడి అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామని తెలిపారు. ప్రతిరోజు యోగా, ధ్యానం చేయడం వల్ల ఎంతగానో ఉపశమనం లభిస్తుందన్నారు.అనుకున్న లక్ష్యాలు చేరగలుగుతామన్నారు.ఇంటర్మీడియట్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ రిటైర్డ్ అధికారి సుహాసిని రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మన దేశంలో ధ్యానం,యోగాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నదన్నారు.ధ్యానం చేయడం వల్ల మంచి అనుభూతిని పొందగలుగుతామన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం,సీఐలు, ఎస్సైలు, నిరుద్యోగ అభ్యర్థులు, శ్రీ రామచంద్ర మిషన్ రీజినల్ కోఆర్డినేటర్ గోవర్ధనగిరి, ధ్యానం శిక్షణామసిబ్బంది, పోలీసు అధికారులు,పాల్గొన్నారు.