Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే భాస్కర్రావు
నవతెలంగాణ-అడవిదేవులపల్లి
బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే అని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు అన్నారు. అడవిదేవులపల్లి మండలంలో శుక్రవారం సత్రశాల వద్ద బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారిన అప్పటినుండి కేంద్రంలో బీజేపీ నాయకులకు వణుకు పట్టిందని, దీని ప్రభావమే మన నాయకులపై ఈడీ, సీబీఐ కేసులతో భయపెడుతున్నారన్నారు. మీరు మా పై ఎన్ని కేసులు పెట్టుకున్న మేము అవినీతికి పాల్పడలేదు మాకు ఈడీ, సీబీఐ అంటే భయమే లేదన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఆగ్రో చైర్మెన్ తిప్పన విజయసింహారెడ్డి, నారాయణరెడ్డి, మండల ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్, వైస్ ఎంపీపీ కూరాకుల మల్లేశ్వరి గోపీనాథ్, జెడ్పీటీసీ కుర్ర సేవ్య నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కూరాకుల చినరామయ్య, ప్రధాన కార్యదర్శి కుర్ర శీను, మాజీ ఎంపీపీ కూరాకుల మంగమ్మ, మాజీ ఏఎంసి డైరెక్టర్ పోలు నాగార్జున ,గ్రామ సర్పంచులు మర్రెడ్డి, భీమా నాయక్ ,బొమ్మరబోయిన నాగేంద్ర రామారావు, తుమ్మల కొండలు ,పెరుమాల శీను, రమావత్ బాలు నాయక్, ఎంపీటీసీలు పేర్ల లింగయ్య, కుర్ర కృష్ణ కాంత్, బీఆర్ఎస్ మండల నాయకులు బండి వెంకటేశ్వర్లు, కేశబోయిన కొండలు, బండి నరసింహారావు, చందర్రావు, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.