Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర డైరెక్టర్ ఆప్ కంపెనీస్, రాజగోపాల్ రావు
- దివిస్ పరిశ్రమలో జాతీయ భద్రతా దినోత్సవ సభ
చౌటుప్పల్ రూరల్:పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా ఉండడంలో కార్మికుడి పాత్ర కీలకమని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తెలంగాణ రాజగోపాల్ రావు అన్నారు.52వ జాతీయ భద్రత దినోత్సవం లో భాగంగా దివిస్ పరిశ్రమలో ఏర్పాటు చేసిన ఎక్స్బిషియన్ ను పరిశీలించారు .అనంతరం జరిగిన భద్రత మాసోత్సవ ముగింపు సభలో పాల్గొని మాట్లాడారు. ప్రతి క్షణం కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పరిశ్రమ యాజమాన్యాలు భద్రత పరికరాలు నాణ్యమైన పరికరాలను కొనుగోలు చేయాలని అన్నారు. రాజీలేకుండా యాజమాన్యం భద్రత ప్రమాణాలు పాటించాలని కోరారు.భద్రత స్వీయ రక్షణలో భాగమని తెలిపారు.నిరంతర ఆలోచనలో భద్రత అనేది ఉండాలని పేర్కొన్నారు.కార్మికులు యాజమాన్యం అందించే సెప్టి పరికరాలను వాడుకోవాలని అన్నారు.కార్మికులు యాజమాన్యం ఇచ్చే సలహాలు,సూచనలు పాటించాలని సూచించారు. దివిస్ పరిశ్రమ భద్రత ప్రమాణాలు పాటించడంలో ముందంజలో ఉండడం అభినందనీయమని అన్నారు.పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు ప్రతి నెల భద్రత అవగాహన కల్పించడం పట్ల అభినందించారు.కంపనీలో సేఫ్టీ లో 100మంది కార్మికులను నియమించడం భద్రత కు ఇచ్చే ప్రాధాన్యతను సూచిస్తుందని తెలిపారు. ఆత్యాధునిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తెలంగాణ వై.మోహన్ బాబు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నల్లగొండ నితిన్ కుమార్,పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ప్రొడక్షన్ ఎస్.రామకృష్ణ,హేమంత్ కుమార్, జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, సేఫ్టీ మేనేజర్ జి. బాలకిషోర్, దివిస్ అధికారులు సాంబశివరావు,శివ ప్రసాద్, సిహెచ్.వీరయ్య ,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.