Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ స్థాయి సంఘ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్
నవతెలంగాణ-నల్లగొండ డెస్క్
సహకార సంఘాలకు స్త్రీ నిధి రుణాలు అందేలా చూడాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అధికారులకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలో జడ్పీ సమావేశ మందిరంలో 1 నుండి 7 స్థాయి సంఘాల సమావేశంలో జడ్పీ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగయ్యయాదవ్ మాట్లాడుతూ ఉపాధి హామి మెటిరియల్ కాంపోనెంట్ వచ్చే విధంగా, స్వయం సహాకార సంఘాలకు స్త్రీ నిధి రుణాలు అందే విధంగా, అలాగే మళ్ళీ వారు ఎప్పటి కప్పుడు తీసుకున్న రుణాలకు చెల్లింపుల చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్యాడి కొనుగోలు కేంద్రాలు ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేసే విధంగా, అకాల వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరిగినదని, వారికి సహాకారం అందే విధంగా మరియు సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 3 లక్షల ఆర్ధిక సాయం అందిస్తుంది. దీనికి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయవలసినదిగా జిల్లా అధికారులకు సూచించారు. జడ్పీ స్థాయి సంఘ అధ్యక్షులు, జడ్పీ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్స్ నిర్మించడం వలన మురుగు నీరు పంట చేలకు వెళ్ళటం వలన సమస్య ఏర్పడుతున్నదని, దీనిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. కనగల్ జెడ్పీటీసీ వెంకటేశం మాట్లాడుతూ ఐబీ అధికారులు మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కావడంలేదని ఎటువంటి సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. ఆరవ స్థాయి సంఘం చైర్మెన్ నారబోయిన స్వరూప రాణి మాట్లాడుతూ 10 వ తరగతి విద్యార్థులను 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చూడాలని, అలాగే న్యూట్రిషన్ ఫుడ్ అందేలా చూడాలని, మెడిటేషన్ చేయించాలని, జిల్లాలో కాలేజిలో కానీ, స్కూళ్లలో గానీ నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు కమిటి సభ్యులను ఆహ్వానించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఐదవ స్థాయి సంఘం చైర్మెన్ కంకణాల ప్రవీణ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించే పోషక అభియాన్ కార్యక్రమాలు చాలా బాగున్నాయని, గ్రామాలలో అడపిల్లలను చిన్న చూపుగా చూస్తున్నారని, ఆడైనా, మగైన, సమానమేనని ప్రజలకు సూచించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిన దగ్గర నుండి బాల్య వివాహాలు తగ్గినాయని, మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసేల అదికారులకు సూచించారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ జెడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో కాంతమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.