Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఊరకుక్కల్లా వెంటడుతున్నాయి
- గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీలను నిలదియ్యాలి
- ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యులు బడుగులు లింగయ్యయాదవ్
నవతెలంగాణ-నల్లగొండడెస్క్
మోటర్లకు మీటర్లు పెట్టాలి అంటూ మోడీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుందని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ వెల్లడించారు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైమాట్లాడారు. కేంద్రం మాట విననందుకు రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన 30 వేల కోట్లు మంజూరీని అడ్డుకుంటున్నారని విమర్శించారు. అటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను గ్రామాల్లోకి వస్తే నిలదియ్యాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఊర కుక్కల్లా ఉసి గొల్పుతున్నారని ఆరోపించారు. అసత్య ఆరోపణలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ పాలకులు తెలంగాణాలో అభివృద్ధి నిరోదకులుగా మారారని తెలిపారు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలో స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి శాసన సభ్యులుగా ఎన్నికయ్యకే అభివృద్ధి మొదలైందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బి ఆర్ యస్ విజరు దుందిభి మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలను అక్కున చేర్చుకోవడమే కాకుండా వారి పెళ్ళిలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకగా అందించే కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ పథకాల అమలు గులాబీ జెండా ఎగురుతున్న తెలంగాణా రాష్ట్రంలోనే నన్నది ప్రతి ఒక్కరూ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అవతరించిన నాటి నుండి హస్తిన పీఠం కదులుతుందన్న భయం మోడీని వెంటాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి జెడ్పీటీసీ పాశం రామ్‌రెడ్డి, తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, సీనియర్ నాయకులు చీర పంకజ్ యాదవ్, కల్లుగీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు కటికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్, బొర్ర సుధాకర్, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షులు ముత్తినేని శ్యాంసుందర్, వైస్ ఎంపీపీలు ఏనుగు వెంకట్ రెడ్డి, సూదిరెడ్డి సుమలత శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మెన్, కందుల రేణుక లక్ష్మయ్య, స్థానిక సర్పంచ్ రొట్టెల రమేష్, మండల పార్టీ కార్యదర్శి, వనపర్తి నాగేశ్వరరావు, కందిమల్ల నరేందర్ రెడ్డి, రైతు బంద్ జిల్లా కమిటీ సభ్యురాలు వనపర్తి జ్యోతి, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కొండ్రస్వరూప, కంచర్ల విజయ, మహేశ్వరి పలువురు ఎంపీటీసీలు సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు అనుబంధ సంఘాల కమిటీలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
బీజేపీివి మతిలేని మాటలు
నడ్డా చేసిన విమర్శల్లో వాస్తవం లేదు
విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల
బీజేపీ నాయకులు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు బీఆర్ఎస్పై చేసిన విమర్శల్లో వాస్తవం లేదన్నారు. దేశాన్ని దోచుకుతింటున్న ఆధాని, అంబానీల అక్రమాలకు వంత పాడుతున్న మోదీ, అమిత్, నడ్డాలాంటి వారు దేశంలోనే అన్నిరకాలుగా అభివద్ధి చెందుతున్న రాష్ట్రం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పై నిరాధారమైన వాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఈడీ విషయంలో కల్వకుంట్ల కవిత స్పష్టంగా ఉందన్నారు.మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వస్తువులపై 45 శాతం భారం వేశారని తెలిపారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, టోల్‌తో పాటు చివరకు మాత్రల ధరలు కూడా పేదవాడికి అందని దూరం తీసుకెళ్లారని విమర్శించారు.కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బండి సంజరులు పోటీపడి ప్రభుత్వంపై విమర్షలు చేస్తున్నారని వారి కలలు కళగానే మిగులుతాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కటికం సత్తయ్యగౌడ్, దేప వెంకట్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, సంధినేని జనార్దన్‌రావు తదితరులు పాల్గొన్నారు.