Authorization
Sat April 05, 2025 08:20:10 am
- ఐజీ తరుణ్ జోషి
నవతెలంగాణ-భువనగిరి
స్వచ్ఛ సర్వేక్షన్ 2023లో భాగంగా భువనగిరి పురపాలక సంఘం పరిధిలో స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు పోలీస్ ఐజీ తరుణ్‌జోషి, చైర్పర్సన్ ఎనబోయిన అంజనేయులు, వైస్ చైర్పర్సన్ చింతల కిష్టయ్య, భువనగిరి కోటపై ప్రత్యేక పారిశుధ్య పనులను చేపట్టారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఐజీ తరుణ్ జోషి మాట్లడారు.పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛందసంస్థలు, యువకులు అన్ని రంగాల వారు పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు.అందరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.వారసత్వపు ప్రాంతాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం ఆయన్ను మున్సిపల్చైర్మెన్, వైస్చైర్మెన్లు సన్మానించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగిరెడ్డి స్వచ్ఛ అంబాసిడర్ అన్వితారెడ్డి, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.