Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదగిరిగుట్టరూరల్
యాదగిరిగుట్ట మండలం లప్పనాయక్‌తండా బస్వాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఆదివారంతో 18వ రోజుకు చేరుకుంది.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని గ్రామస్తులు రిజర్వాయర్ కట్టపై ఆందోళన చేస్తున్నారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు, ఇండ్ల నష్టపరిహారం, భూమి నష్టపరిహారంతో పాటు దాతరపల్లి గ్రామపంచాయతీపరిధిలోని 294 సర్వే నెంబర్లో లేఅవుట్ చేసి ఇండ్ల స్థలాలు కేటాయించాలని, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుజ్జి శంకర్‌నాయక్, ఉపసర్పంచ్ మంక్యానాయక్, మోహన్, దశీరాంనాయక్, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.