Authorization
Sat April 05, 2025 09:40:21 am
- కలెక్టర్ పమేలాసత్పతి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 313వ వర్థంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ పమేలా సత్పతి జ్యోతి ప్రజ్వలన గావించి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ అధికారి యాదయ్య, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి జయపాల్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యాంసుందర్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ కృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరావుచారి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ గిరిధర్, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు బొలగాని జయరాములుగౌడ్, ఏశాల అశోక్, కొత్త నర్సింహస్వామి, లక్ష్మీనారాయణగౌడ్, అక్కినేపల్లి వెంకటరత్నం, మాటూరి అశోక్, మైసయ్య, బలరాజ్, ఉపాధ్యక్షులు రంగ కొండల్, కొండ అశోక్ లు పాల్గొన్నారు.