Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు
- అవగాహన కల్పిస్తున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
- నిరుద్యోగంపై సర్వే
నవతెలంగాణ-మిర్యాలగూడ
చదువు... ఉద్యోగం... సంపాదన... అనే ధోరణిలో ఉండే విద్యార్థులకు సేవ మార్గంలో నడిచేందుకు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) అవకాశం కల్పిస్తుంది. విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రత్యేక శిబిరాలు దోహదపడుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి గ్రామీణ ప్రాంత ప్రజలకు అనేక సమస్యల పరిష్కారం కోసం అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న మూఢనమ్మకాలను రూపుమాపేందుకు విద్యార్థులు కృషి చేస్తున్నారు. పచ్చదనం, పరిశుభ్రత, అంటువ్యాధుల నివారణ, సామాజిక అంశాలపై అవగాహన, హరితహారం అక్షరాస్యత స్వచ్ఛభారత్ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, వాననీటి సంరక్షణ, ఓటు హక్కు నమోదు, సైబర్ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిరుద్యోగ యువతపై సర్వే చేస్తున్నారు.
మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు గత వారం రోజుల క్రితం మండలంలోని యాదగిరి పల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఆలగడప గ్రామంలో యూనిట్ టూ శిబిరం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
కళాశాలలో అమలు చేస్తున్న జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సామాజిక స్పృహ, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడుతున్నాయి. సమాజ సేవ చేయాలనుకునే యువతకు ఇదొక వేదికగా తోడ్పడుతున్నది. విద్యార్థులు కూడా ఎన్ఎస్ఎస్ ద్వారా సేవా అందించాలని ఆలోచనతో ఉన్నారు. ఎన్ఎస్ఎస్లో చేరి సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయా సందర్భాలలో వివిధ రాష్ట్రాలలో జరిగే నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులకు, నేషనల్ అడ్వెంచర్ క్యాంపులకు, వెస్ట్ జోన్ పరెడ్స్కు హాజరై పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వారం రోజులపాటు గ్రామంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ శ్రమదానం చేయడంతో పాటు గ్రామీణ ప్రజల్లో సామాజిక చైతన్యం కల్పించడం జరుగుతుంది. ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్‌కు క్రమశిక్షణ అలవడటంతో పాటు కష్టపడే తత్వం, సమస్యలకు ఎదురోడ్డే మనోధైర్యం, నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి. గ్రామంలో ప్రతి ఒక్కరికి విద్య మీద అవగాహన కల్పించడంతోపాటు ఆరోగ్యంపైన కూడా అవగాహన కల్పించడం జరుగుతున్నది. మా కోసం కాదు మీ కోసం అనే నినాదంతో సమాజ సేవా కార్య్రమాల్లో ముందుకు వెళుతున్న ఎన్ఎస్ఎస్లో భాగస్వామ్యులు అయి ప్రశంసలు అందుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్ పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి రెగ్యులర్ యాక్టివిటీస్‌తో పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలపైన, బాల్య వివాహ నిర్మూలన, జనాభా సమస్య, రోడ్డు భద్రత చట్టాల పట్ల ప్రజలకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం, ప్రకృతి విపత్తులో సహాయ కార్యక్రమాలు చేపట్టడం ముఖ్య ఉద్దేశం '' మానవసేవే మాధవసేవ'' అన్న వివేకానంద స్వామి సూక్తులకు అనుగుణంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ సామాజిక సైనికులుగా గ్రామాలలో సేవ చేయడం జరుగుతున్నది.
సేవా భవాని పెంపొందిస్తున్నాం...
కోటయ్య (ప్రోగ్రామ్ ఆఫీసర్)
జాతీయ సేవా పథకంలో చేరి విద్యార్థి దశ నుంచి సేవా భావాన్ని పెంపొందించుకుంటున్నారు. సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం. ఎన్ఎస్ఎస్ లక్ష్యంగా సామాజిక బాధ్యతగా ఎన్ఎస్ఎస్ శిబిరాల్లో పాల్గొనే వాలంటీర్స్‌కు ధృవపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ధ్రువపత్రాల ద్వారా ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది.
సేవా కార్యక్రమాలు చేస్తున్నాం
డాక్టర్ పీ.మద్దిలేటి (ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్)
గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాము .దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది సమాజాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని అని అన్నారు.ఎన్ఎస్ఎస్ శిబిరాల్లో పాల్గొనే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సేవ చేసే అవకాశం తో పాటుసామాజిక స్పృహ,నాయ కత్వ లక్షణాలు పెంపొండం తో పాటు మంచి గుర్తింపు లభిస్తుంది. మహాత్మ గాంధీ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ సేవ చేయడంలో ముందున్నారని గర్వంగా చెప్తున్నాను.
విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు
డాక్టర్ బిక్షమయ్య (ప్రిన్సిపాల్)
మా కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ యాదగిరిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని వారం రోజులు ఈ గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాం. ఆరవ రోజైన ఈ రోజు గ్రామంలో శ్రమదానం చేసిన వాలంటీర్స్ అధికారిక విద్య, సాధారణ ఉపాధిలో లేని 15నుండి29 వయస్సు ఉన్న యువత పై కూడా సర్వే చేశారు.
ప్రజలలో చైతన్యం తీసుకురావచ్చు..
పీ.రాము(బీఏ(2ఇయర్),కేఎన్ఎం కశాశాల)
ప్రజలలో చైతన్యం మార్పు తీసుకురావచ్చు ఎన్ఎస్ఎస్ శిబిరాల ద్వారా స్వచ్ఛభారత్ పరిశుభ్రత, హరితహారం వంటి కార్యక్రమాలు చేయబడుతున్నాం. చదువుతోపాటు సామాజిక సేవలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా నాయకత్వ లక్షణాలతో పాటు స్నేహభావం సమాజం పై అవగాహన పెరిగింది.
నాయకత్వ లక్షణాలు అలవడుతున్నాయి
యూ.లావణ్య (బీఏ(2ఇయర్) కేఎన్ఎం కళాశాల)
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడమే ఎన్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం. ఇదే కాకుండా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకి తీయడానికి వేదికగా నిలుస్తుంది. గ్రామస్తులను అక్షరాస్యతమైన మూఢనమ్మకాలపైన హరితహారం స్వచ్ఛభారత్ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణ పర్యావరణ పరిరక్షణ సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ గ్రామంలో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాము. ఈ శిబిరం వలన మాకు కూడా క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలు అలవడుతున్నాయి.