Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగారం
భారత తపాల శాఖలో ఉన్న అన్ని పోస్టల్ పథకాలకు వడ్డీ రేట్లు భారీగా పెరిగాయని సూర్యాపేట జిల్లా సూపరిడెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రతి మూడు నెలల కోసారి పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు సవరిస్తూ ఉంటుందని, ఇందులో భాగంగా కొత్త ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి సంవత్సరంనికి గాను పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు బాగా పెంచిందని, వాటికి సంబంధించిన వివిధ స్కీములయిన సేవింగ్ అకౌంట్‌కి 4 శాతం, రికరింగ్ డిపాసిట్ అకౌంట్ 6.2 శాతం, టైం డిపాసిట్ అకౌంట్ 1 సంవత్సరనికి 6.8 శాతం, మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌కు 7.4 శాతం, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ కు 7.7 శాతం, కిసాన్ వికాస్ 7.5 శాతం, సీనియర్ సిటిజన్ అకౌంట్ కు 8.2 శాతం, సుకన్య సమృద్ధి అకౌంట్ కు 8.0 శాతం, పీపీఎఫ్ అకౌంట్ కు 7.1 శాతం వడ్డీ లభిస్తుందన్నారు. ఈ అవకాశం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.