Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకిరేకల్:కేతేపల్లి మండలం బండపాలెం గుట్టపై తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుని సోమవారం సీతారామచంద్ర స్వాములు చందుపట్ల గ్రామానికి చేరారు. గ్రామానికి చేరిన స్వామివార్లకు ఇమడపాక లక్ష్మి వెంకన్న , ఆలయ చైర్మెన్ మెడవరపు కిషన్ రావు స్వాగతం పలికారు.అనంతరం నేల తాళాలు, డబ్బు చప్పుల మధ్య స్వామివారిని బెస్తబోయిలు పల్లకి సేవలో ఊరేగింపుగా స్వామివారిని చందుపట్ల ఆలయానికి చేర్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి అంబా రఘు చైర్మన్ మారం మీనారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, నాగేంద్రబాబు, విక్రం రెడ్డి, ప్రవీణ్, అధ్యక్షుడు వడ్డెబోయిన యాదగిరి, మంగినేపల్లి వెంకటయ్య, యాదగిరి చంద్రబోయిన శీను గంగుల వీరయ్య మంగినపల్లి శంకరు, బెస్త బొయుల్లు పాల్గొన్నారు.