Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
యువత సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలని, రక్తదానం ప్రాణదానంతో సమానమని చౌటుప్పల్ సీఐ మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని రామ్‌నగర్‌లో అయాన్స్ భార్గవ్ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నివ్య హాస్పిటల్ వారి సౌజన్యంతో తొర్పు నూరి నర్సింహాగౌడ్ పుట్టిన రోజు సందర్భంగా స్వచ్చంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సీఐ ప్రారంభించారు. ఈ శిబిరంలో 100 మందికిపైగా యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్‌కుమార్, వేణు, ట్రస్టు చైర్మెన్ మురళి, భానుప్రకాశ్, భరత్, రిజ్జు, మున్న, శ్రీకాంత్‌రెడ్డి, శివ, శ్రీకాంత్ పాల్గొన్నారు.