Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలపై పట్టింపులేని అధికారులు
- ఆవేదన చెందుతున్న బాధితులు
నవతెలంగాణ- నల్లగొండ కలెక్టరేట్
ప్రభుత్వ కార్యాలయాలు కొందరు అధికారులకు సొంత ఇల్లుల మారిపోయాయి. వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. ఇష్టం వచ్చినప్పుడు కార్యాలయానికి రావటం ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవడం పరిపాటిగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారమే ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఉన్నత అధికారులందరూ సకాలంలో కార్యక్రమానికి హాజరై తమ, తమ విభాగాలకు చెందిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి. అదే ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం. ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నవతెలంగాణ పరిశీలించగా అవి ఏవి కూడా అక్కడ జరగటం లేదు. అధికారులు ఎవరూ సమయానికి రావడం లేదన్న విషయం బహిర్గతమైంది. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించే ఈ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టరేట్ కు వస్తూ ఉంటారు. మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టర్ ను కలిస్తే నైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్దేశంతో ఎంతో దూరం నుండి వస్తూ ఉంటారు. 10:30 గంటలకు ప్రారంభం అయ్యే కార్యక్రమానికి అరగంట ముందుగానే అంటే 10 గంటలకే జిల్లాస్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలి. జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు, కలెక్టరేట్ ఏవో మోతిలాల్ ఒకరిద్దరు అధికారులు మినహాయించి సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖలకు చెందిన కిందిస్థాయి అధికారులు ఉదయం 10:50 గంటలు అయినా కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. అసలే ఎండాకాలం, ఆపై అధికారులు ఆలస్యం గా రావటం తో సమస్యల పరిష్కారానికి దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నానా తండాలు పడాల్సి వచ్చింది. ప్రజా సమస్యలు అంటే అధికారులకు పట్టింపు లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.