Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీఏ మెంబర్ పంతం కృష్ణ
నవతెలంగాణ- ఆలేరుటౌన్
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాలూ అభివృద్ధి చెందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా నాయకులు, యాదాద్రి భువనగిరి ఆర్టీఏ మెంబర్ పంతం కృష్ణ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా మారాయన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే కసీిఆర్ని ముచ్చటగా మూడోసారి గెలిపించుకోవాలని కోరారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ కేసిఆర్ కిట్ వంటి పథకాలతో ప్రతి ఇంటికి లబ్దిచేకూరుతుందని తెలిపారు. అర్హులైన పేదలకు ఇంటినిర్మాణం కోసం రూ3 లక్షలను ప్రభుత్వం అందజేయనుందని వివరించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నాయకత్వం ో ఆలేరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకు పోతుందన్నారు. వందల కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. మరోసారి ఆలేరు ఎమ్మెల్యేగా సునీత మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచి మంత్రిగా చూడాలని కోరారుజ ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేసి గడపగడపకు కేసీిఆర్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు.