Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళులర్పించిన కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య జయంతిని సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి జ్యోతి వెలిగించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెపురం రాజు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాల ఫలితంగానే దొడ్డి కొమురయ్య జయంతి, వర్థంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పీటీసీలు అనురాధ, సుబ్బురు బీరు మల్లయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యాదయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం నాగేశ్వరావు చారి, జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు నరసింహ, గొర్రెల మేకల పెంపొందారుల సంఘం జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి మధ్య పురం రాజు, నాయకులు బుడుమ శ్రీశైలం, ఎల్లంల సత్యనారాయణ, ర్యాకల శ్రీనివాస్, పాక జహంగీర్, అనంతారం సర్పంచ్ మల్లికార్జున్, జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, ఎ.అశోక్, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు డోకే బాలకృష్ణ, ఏషాల అశోక్, కొడారి వెంకటేష్, పుట్ట వీరేష్ యాదవ్, అచ్చయ్య లు పాల్గొన్నారు.
వలిగొండ : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 96వ జయంతి కార్యక్రమాన్ని సీపీఐ(ఎం) మండల కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురయ్య చిత్రపటానికి మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కార్యదర్శివర్గ సభ్యుడు మెరుగు వెంకటేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ మండల కమిటీ సభ్యులు దుబ్బ లింగం బుగ్గ చంద్రమౌళి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాధారపు మల్లేశం, ఆ పార్టీ నాయకులు వేముల జ్యోతి బస్, సందెల దుర్గాప్రసాద్, శంకరయ్య ,కిషోర్,తదితరులు పాల్గొన్నారు.