Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్కువ ధరలకే ఔషధాలు
నవ తెలంగాణ - భువనగిరి
జిల్లాకేంద్రంలోని బంజార హిల్స్‌ని సుందరయ్య భవన్లో దొడ్డి కొమరయ్య జనరిక్ మెడికల్ హాల్ ను ఏర్పాటు చేశారు. ఈ జనరిక్ ఔషధాల బలం ప్రభావం మోతాదు, రూపం, సమయపాలన, నాణ్యత, భద్రతాపరంగా బ్రాండ్ ఔషధాలకు సరి సమానంగా సరితూగుతాయి. ప్రజలకు తక్కువ ఖర్చులో మందులను అందించాలని ఉద్దేశంతో తెలంగాణ సాయుధ రైతాంగ విప్లవ పోరాట యోధుడు దుంపల మల్లారెడ్డి పేరుతో ప్రవేశపెట్టిన మందుల దుకాణమే జనరిక్ మెడికల్ హాల్ .
రూ.100పెట్టి కొని బ్రాండెడ్ మందులు అదే నాణ్యత అదే పరిమాణంతో అతి తక్కువ ధరకు 10 నుండి 20కి జనరిక్ మందులు లభిస్తాయి. బ్రాండెడ్, జనరిక్ మందుల ఔషధాలలో ఎలాంటి తేడా ఉండదు. బ్రాండెడ్ సంస్థలు తమ బ్రాండ్ పేరుతో వాటిని అమ్ముతాయి. జనరిక్ ఔషదాలపై ఎలాంటి బ్రాండ్ పేరు ఉండదు. ఔషధం మాత్రం అదే ఉంటుంది. ఫార్మా సంస్థల ఫార్ములాతో మందులను తయారుచేసి తక్కువ ధరక ప్రజలకు జనరిక్ మందుల షాపులలో అమ్ముతారు.
జనరిక్ మందులు మంచివే..
చాలామంది బ్రాండెడ్ మందులు నమ్ముతారు.ప్రయివేటు ఫార్మా సంస్థలు తమ సేల్స్ మేన్ల చేత వైద్యులు, ఆసుపత్రుల వద్దకు పంపించి బాగా ప్రమోషన్లు చేయిస్తారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. దీంతో వైద్యులు కూడా బ్రాండెడ్ మందులని రోగులకు రాస్తారు. జనరిక్ మందులు నేరుగా ప్రజలకు తక్కువ ధరలకు అందించాలని లక్ష్యంతో తయారుచేసినవి. జనరిక్ ఔషధాలు సరి సమానంగా పనిచేస్తూ ప్రజల ధనాన్ని ఆదా చేస్తుంది.
జనరిక్ ఔషధాలను వాడండి
సుందరయ్య భవన్ దుంపల మల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జనరిక్ మెడికల్ హాల్లోని ఔషధాలను కొనుగోలు చేయాలని ఆ ట్రస్ట్ చైర్మెన్ గూడూరు అంజిరెడ్డి, కార్యదర్శి ఎం డి.జహంగీర్ కోరారు. నేటి ఆధునిక సమాజంలో వైద్యానికి అధిక ఖర్చులు అవుతున్నాయని వాటిని తగ్గించడానికి తమ ప్రయత్నంగా ట్రస్టు ద్వారా జనరిక్ మందులను అందిస్తున్నామ న్నారు. విద్యావంతులు, మేధావులు, ప్రజలు ఈ జనరిక్ మెడికల్ హాల్‌ను ఆదరించాలని కోరారు.