Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఆకలి దారిద్య్రయాలను పారద్రోలి అభివృద్ధి, సంక్షేమం విషయంలో దేశంలోనే తెలంగాణను నెంబర్‌గా ఉంచిన గులాబీ జెండానే మన అందరికీ అండ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.ఆదివారం రాత్రి తాళ్లగడ్డలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాపర్తి శ్రీనివాస్‌గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.ఆయనకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూసీ మురికి నీటి నుండి సూర్యాపేట ప్రజలకు విముక్తి కల్పించింది కూడా గులాబీ జెండా అన్నారు.2014కు ముందు కంపచెట్లతో ఉన్న తాళ్ళగడ్డ బీఆర్ఎస్ హయాంలో బంగారుగడ్డగా మారిందన్నారు. సూర్యాపేటలో ఇప్పటికీ వరకు జరిగిన..జరుగుతున్న అభివృద్ధి విలువ రూ.9 వేల కోట్ల పైమాటే అని తెలిపారు. దీనంతటికీ కారణం కేసీఆర్ నాయకత్వంలోని గులాబీ జెండాయేనన్నారు.అభివృద్ధి విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల విషప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.
తాళ్ళగడ్డ ప్రజలకు మంత్రి వరాలు
ఆత్మీయ సభ సందర్బంగ్గా వేలాదిగా తరలివచ్చిన తాళ్ళగడ్డ ప్రజానీకానికి మంత్రి జగదీశ్‌రెడ్డి వరాలు కురిపించారు.రోడ్డు విస్తరణ సమయంలో నిర్మించిన డివైడర్‌ను తొలగించడంతో పాటు ఆ ప్రాంత వాసులకు ఆరాధ్యదైవంగా ఉన్న ముత్యాలమ్మ తల్లి ముఖద్వార నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు.కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ గోపగాని వెంకట్‌నారాయణగౌడ్, గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్లఅన్నపూర్ణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాల సైదులు గౌడ్, కౌన్సిలర్లు అనంతుల యాదగిరిగౌడ్, లక్ష్మీకాంతమ్మ, భరత్ మహాజన్, కుంభంరాజేందర్,రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, బైరు వెంకన్నగౌడ్, చెనగాని రాంబాబుగౌడ్, కక్కిరేని నాగయ్యగౌడ్, బైరుదుర్గయ్య, అయూబ్‌ఖాన్, పల్స వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.