Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం గొల్లకురుమలకు గొర్రెల పంపిణీలో భాగంగా గొల్లకురుమల అకౌంట్లోకి నగదు బదిలీ చేయాలని తెలంగాణ గొర్రెలు,మేకల పెంపకందార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కడెంలింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో అదనపుకలెక్టర్ కేశవ్ హేమంత్పటేల్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత పూర్తయినప్పటికీ గొల్ల కురుమల కంటే మధ్య దళారులు,ఆంధ్ర బ్రోకర్లు ఎక్కువగా లబ్ది పొందారని విమర్శించారు.కనీసం రెండో విడతలో12,782 మంది లబ్దిదారులకు అవినీతి జరగకుండా ఉండాలంటే నేరుగా వారి అకౌంట్లోకి నగదు బదిలీ చేయాలని కోరారు.మునుగోడు నియోజకవర్గంలో మధ్యంతర ఎన్నికల సందర్భంగా గొల్ల కురుమలకు అకౌంట్లోకి నగదు బదిలీ చేశారని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయా లని డిమాండ్ చేశారు.వినతిపత్రం అంద జేసిన వారిలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వజ్జ వినరు యాదవ్,గుండాల లింగయ్యయాదవ్, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు కంచుగొట్ల శ్రీనివాస్‌యాదవ్,జిల్లా నాయకులు నారబోయిన శ్రీనివాస్, పాశం వెంకట్‌నారాయణ, కుక్కల సాంబయ్యయాదవ్ ఉన్నారు.