Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసన వ్యక్తం చేసిన దళిత సామాజిక సంఘాల నాయకులు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్.అంబేద్కర్ల జయంతి ఉత్సవాల సన్నాక సమావేశానికి కలెక్టర్, ఎస్పీ హాజరుకాకపోవడాన్ని నిరసిస్తూ దళిత, సామాజికసంఘాల నాయకులు నిరసనతెలిపారు.ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తేదీ సమయం ప్రకటించి అందరికి సమాచారం అందించి రాకపోవడాన్ని ఖండించారు. దళిత,మహాను భావులను, దళితులను అవమానపరిచే విధంగా జిల్లా కలెక్టర్ వ్యవరించారని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చిన్న శ్రీరాములు,వ్యవసాయ కార్మికసంఘం నాయకులు ములకలపల్లిరాములు,మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హస్సేన్,కెేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోటగోపి,ఇంకా సామాజిక, దళిత సంఘాలనాయకులు ఎర్రవీరస్వామి, బొలెద్దువినరు,డీలర్ వెంకన్న, దయానంద్, దేవయ్య,గాజుల నర్సయ్య,బచ్చలకూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.