Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జాతరలకు పునర్ వైభవం వచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.మండలపరిధిలోని తిమ్మాపురం శివారులో రెండు సంవత్సరాలకొకసారి జరిగే శ్రీ చౌడమ్మ తల్లి జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ... తొమ్మిదేళ్ల పాలనలో చౌడమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాతరకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం చందుపట్ల, తిమ్మాపురం, మోదీనిపురం చుట్టుపక్కల గ్రామాలనుంచి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారుచివ్వెంలపీఏసీఎస్ చైర్మెన్ మారినేని సుధీర్‌రావు ఆధ్వర్యంలో చందుపట్ల నుంచి డీజే చప్పులతో, కోలాటాలతో యాదవ భక్తులు చౌడమ్మ జాతర వరకు భారీర్యాలీతో గంపలు తీసుకెళ్లారు. డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్, చివ్వెంల పీఏసీఎస్ చైర్మెన్ మారినేని సుధీర్‌రావు,సర్పంచ్ జాలమానసజయరాం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.