Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎటుచూసినా కన్నీటి పోరలు
- బలగం సినిమా చూస్తూ.. కన్నీరుమున్నీరు
- బంధం మారుతోంది బలగం ఒక్కటవుతోంది
- గ్రామాలలో దండోరతో ప్రచారం
ప్రజాప్రతినిధుల సహకారంతో సినిమా ప్రదర్శన పల్లెల్లో కన్నీటి , తెరలు, పొంగుతున్నాయ్.. మనుషుల హృదయాలు ద్రవించిపోతున్నాయి..పేగు బంధాలు ఒక్కోటిగా పెనువేసుకుంటున్నాయి.. చిన్న పెద్ద మరిచి నడి ఊర్లోను ఎక్కెక్కి ఏడుస్తున్నారు...దూరమైననోళ్లను దూరంగా బతుకుతునోళ్లను తలుచుకుని మదనపడుతున్నారు... పంతాలు పట్టింపులను పక్కనబెట్టి మళ్లీ ఒకటవుతున్నారు...అదే మన నిజమైన, బలగం, అంటూ ఆనందం భాష్పాలు రాల్చుతున్నారు.
నవతెలంగాణ-బొమ్మలరామారం
చిన్న సినిమాగా విడుదలై.. భారీ విజయం సాధించిన చిత్రం బలగం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.25 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టి భళా అనిపించింది. సినిమాను థియేటర్లలోచూసిన అభిమానులు తమ కుటుంబ సభ్యులు, బంధువులకు చూపించాలన్న తాపత్రయంలో అనేక గ్రామాల్లో ఎల్ఈడీ స్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో సోమవారం రాత్రి సినిమాను ప్రదర్శించారు.దీంతో సినిమాను చూసిన వందలాది మంది గ్రామ ప్రజలు క్లైమాక్స్‌లో కన్నీరుమున్నీరుగా విలపించారు. పగలు ప్రతీకారాలు ఆగాలంటే... ఒకవైపు ఆగితే రెండోవైపు అలసిపోయి అవుతారని ఓ చిత్రంలో కథానాయకుడు తండ్రి భావిస్తాడు. అలసిపోతే కాదు, మనుషులు మారితేనే పగలాగుతాయని హీరో భావించి ప్రతి ఒక్కరికి ప్రేమతో దగ్గరవుతుంటాడు. చివరికి అనుకున్న మార్పును తీసుకొచ్చి రెండు గ్రామాలు, రెండు కుటుంబాలు కలిసిపోయేందుకు కారణవుతాడు. చిత్రంలో దర్శకుడు చూపించే మూడు గంటల సినిమా నిజజీవితంలో సాధ్యమా అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమైన... అదే ఆచరణలో అసాధ్యమేమి కాదని నిరూపిస్తుంది ' బలగం చిత్రం..! ఎన్నో నేరారోపితాలకు నెలవుగా మారుతున్న తరుణంలో ప్రేమాప్యాయతలు, అనుబంధాలను ప్రతి ఒక్కరితోనూ తట్టిలేపుతూ పల్లె పల్లెకు విస్తరిస్తుంది ప్రదర్శన. చిన్న చిన్న మనస్వార్థాలతో మాటలు కూడా కరువైనచోటు మళ్లీ అనురాగాపు పరిమాళాలను వెదజల్లుతోంది. అన్ని వర్గాల ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఈ చిత్రం తెలంగాణలోని గ్రామ గ్రామాన ప్రతి గుండెను కదిలిస్తోంది అందరినీ ఒక్కటి చేస్తుంది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు,అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.