Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
గొర్రెల పంపిణీ పథకంలో లబ్దిదారుల వాటా గురించి అవగాహన కలిగించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పశు వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కాన్ఫరెన్స్ హాలులో ఆయన పశు వైద్య అధికారులతో సమావేశమై జిల్లాలో చేపట్టబోయే రెండవ విడుత గొర్రెల పంపిణీ సన్నద్ధత కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ, ఇప్పటికే గుర్తించిన లబ్దిదారులకు వారి వాటా ధనం గురించి గ్రామాలలో క్షేత్ర స్థాయిలో వారిని కలిసి అవగాహన కల్గించాలని ఆదేశించారు. లబ్దిదారుల దరఖాస్తు ఫారము, కుల ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం కాపీ మొదలైన ధృవీకరణ పత్రాలను సేకరించి ఇ-లాభ్ పోర్టల్లో నమోదు చేసి గొర్రెల కొనుగోలుకు వెళ్లేందుకు వారిని సిద్దం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 15,392 యూనిట్లను రెండవ విడుతలో కొనుగోలు చేయాల్సి వుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ వి కృష్ణ, సహాయ సంచాలకులు డాక్టర్ ఐలయ్య, డాక్టర్ సంజీవరావు, డాక్టర్ మోతీలాల్, జిల్లాలోని పశు వైద్య అధికారులు పాల్గొన్నారు.