Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ విప్,శాసన సభ్యురాలు గొంగిడి సునీత
నవతెలంగాణ -ఆలేరుటౌన్
నిరుపేదలను వృద్ధిలోకి తీసుకురావడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని , రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ నిధులచే నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లును ముఖ్యఅతిథిగా హాజరై ఆమె లబ్దిదారులకు ఇండ్ల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచింది అన్నారు. 64 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గాను, 58 ఎమ్మెల్యే సునీత చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్ధారించాల్సి ఉం్దఇ. పోలీస్ బందోబస్తు మధ్య డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జరిగింది.. ఈ కార్యక్రమంలో తహసీల్దార్్ రామకృష్ణ , ఆర్అండ్బి ఈఈ శంకరయ్య, మున్సిపల్ కమిషనర్ చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మెన్ మాధవి వెంకటేష్, మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్, పిఎసిఎస్ చైర్మెన్ ్ మొగ లగాని మల్లేశం, వైస్ చైర్మెన్ చింతకింది చంద్రకళ మురహరి,కౌన్సిలర్లు బేతి రాములు, రాయపురం నరసింహులు, కౌన్సిల్ సభ్యులు బింగి . లతా రవి, చింతకింది మురళి, ఆడెపు బాలస్వామి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు పుట్ట మల్లేష్ , పోరెడ్డి శ్రీనివాస్, సీస మహేశ్వరి, దాసి సంతోష్, జల్లి నరసింహులు, కుండే సంపత్, పత్తి వెంకటేష్, దయ్యాల సంపత్ పాల్గొన్నారు.