Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
పదోతరగతి ప్రశ్న పత్రం తెలుగు, హిందీ పేపర్లు వాట్సాప్ ధ్వారా లీకేజీ చేసిన వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.మంగళవారం తిరుమలగిరిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.మొన్న టీఎస్పీటీఎస్సీలో టౌన్ ప్లాన్లింగ్ పరీక్ష లీకేజీనీ మరవకముందే నిన్న పదోతరగతి పరీక్షలు ప్రారంభమై మొదటిరోజు తెలుగు, నేడు హిందీ పేపర్ లీకేజీలు చేయడం దారుణమన్నారు. పర్యవేక్షణ లోపం చేసినందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు నిమ్మల శ్రీనివాస్‌యాదవ్,మత్య్సగిరి తదితరులు పాల్గొన్నారు.