Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హామీలు ఇస్తున్నారు కానీ అమలు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి ఆరోపించారు.మంగళవారం కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షులు బాల్దూరి సుధాకర్‌రావు ఆధ్వర్యంలో స్థానిక 30వ వార్డులో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా, పార్టీ జెండా ఎగరవేశారు.గడపగడపకు కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు.కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన బీఆర్ఎస్లకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజలు విసుగు చెందారన్నారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విశేష స్పందన వచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పాలూరి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్‌రెడ్డి, తోట శ్రీను,చామర్తి బ్రహ్మం,యాకోబు, ఖాజాగౌడ్, పిడతల శ్రీను, సైదుబాబు, గట్ల గౌతం,ఏసు,సంపెట రవి,పి.వెంకటేశ్, కె.ప్రవీణ్, భాగ్యరాజు పాల్గొన్నారు.