Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
వేసవిలో నీటి కొరత లేకుండా చూడాలని ఎంపీపీ నెమ్మాది భిక్షం, జెడ్పీటీసీ మామిడి అనితఅంజయ్య అధికారులను ఆదేశించారు.మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి వారు అధ్యక్షత వహించి మాట్లాడారు.మండలంలో మిషన్ భగీరథ పైపుల కోసం మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి నిధులతో రూ.18.50లక్షలు మంజూరుచేశామన్నారు.మండలంలో జెడ్పీ పాఠశాలలకు కోటి రూపాయలతో ఫర్నీచర్‌ను కొనుగోలు చేశామన్నారు.గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.అనంతరం జిల్లాలో ఉత్తమపంచాయతీ అవార్డులు పొందిన వివిధ గ్రామాల సర్పంచులను, కార్యదర్శులను శాలువాలు కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ బాణాల శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఈ గోపి, ఏపీఎం అజరు, ఏపీఓ రవి, ఎంపీఓ చెరుకుపల్లి జానయ్య, ఎంఈఓ రవి, ఆర్ఐ సుందరి మట్టయ్య పాల్గొన్నారు.