Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రాష్ట్రం ప్రభుత్వం ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళాకేంద్రాలను జిల్లాలోని మహిళందరూ సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ తెలిపారు.కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలోని కుడకుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐసీడీఎస్, మెప్మా మహిళా ఉద్యోగులు, సిబ్బంది సుమారు 60 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారని, దీని కొరకు అన్ని ఏర్పాట్లు ఆరోగ్య శాఖ చేసిందన్నారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలకు 8 విభాగాల్లో పరీక్షలు చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కోటాచలం, మెప్మాపీడీ రమేష్‌నాయక్,డాక్టర్ అనిశా, డాక్టర్ రమ్య, డాక్టర్ నాజ్యా, ఆశాలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.