Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -కేతపల్లి
రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో బీజేపీి ప్రభుత్వం ప్రజలపై అనేక పన్నుల భారాలను మోపుతుందన్నారు. దేశాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సారధ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు తమ మద్దతును తెలపాలని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరికీ అందేలా చూసేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించారని చెప్పారు. దేశ ప్రజలందరూ రైతు సంక్షేమ ఆశించే బీఆర్ఎస్ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మెన్ బండ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేతపల్లి బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మారం వెంకట్ రెడ్డి నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి నాయకులు బంటు మహేందర్ వివిధ గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు ,నాయకులు పాల్గొన్నారు.