Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక హక్కులను కాలరాయడం దుర్మార్గమైన చర్య
- కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి
- రైతాంగానికి కనీసం మద్దతు ధర చట్టం తేవాలి
- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య
- చలో ఢిల్లీ ధర్నాకు సంఘీభావంగా జిల్లా పలుచోట్ల
- నిరసన కార్యక్రమాలు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
దేశంలో బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. బుధవారం చలో ఢిల్లీ పార్లమెంటు ముందు జరుగుతున్న ధర్నాకు సంఘీభావంగా సీఐటీయూ నల్లగొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నెహ్రు గంజ్ హమాలి ఆఫీస్ దగ్గర నల్లజెండాలు, ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగ సత్తయ్య మాట్లాడారు. మోడీ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందర ధరలు తగ్గిస్తానని, యాటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, నల్లధనం తెచ్చి ప్రతి కుటుంబం అకౌంట్లో 15 లక్షలు వేస్తామని వాగ్దానాలు చేసిన మోడీ వాగ్దానాలకు భిన్నంగా కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఈ విధానాలను ప్రతిఘటించడానికి దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు రైతాంగానికి కనీస మద్దతు ధర తేవాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టే విధానాలపై మతోన్మాద రాజకీయాలపై ప్రజలు సమర శంఖం పూరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు అవురేషు మారయ్య ,కార్యదర్శి కాడింగు రవి ,వీరబాబు, నాగరాజు , సురేష్, వెంకన్న, కష్ణయ్య, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : దేశంలో బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ, రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం చలో ఢిల్లీ పార్లమెంటు ముందు జరుగుతున్న ధర్నాకు సంఘీభావంగా సీఐటీయూ ఆధ్వర్యంలో రైల్వే హమాలీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి మాట్లాడారు. . ఈ ధర్నాతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, నాయకులు తిరుపతి రామూర్తి, ధనావత్ బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల : మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ,రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో దామరచర్ల లో బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దయానంద్, ఉపాధ్యక్షుడు సుబాని, రవి, గ్రామపంచాయతీ వర్కర్స్ మండల నాయకులు శ్రీరాములు, నాగయ్య జోలమ్మ, పాపయ్య, మేరమ్మ, ఆశా వర్కర్స్ జిల్లా కమిటీ సభ్యురాలు మహేశ్వరి జయమ్మ, పద్మ, శారద, శ్రీదేవి, సీఐటీయూ మండల ఉపాధ్యక్షులు ఎస్కే సుభాని, రవి తదితరులు పాల్గొన్నారు.
మాడుగులపల్లి :మండల కేంద్రంలో హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సమక్షంలో బుధవారం ఢిల్లీలో జరుగుతున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాకు సంఘీభావంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నల్ల క్లాత్‌తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం మండల అధ్యక్షులు పుల్లెంల రాజు, కార్యదర్శి మాడుగుల యాదయ్య, సీఐటీయూ కన్వీనర్, ఖమ్మంపాటి పరశురాములు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గడగోజు వెంకటాచారి, మల్లారెడ్డి, సైదులు, జానయ్య, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ : కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దుచేసి, రైతాంగాన్ని కనీసం మద్దతు ధర చట్టం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య డిమాండ్ చేశారు. బుధవారం చలో ఢిల్లీ పార్లమెంటు మందు జరుగుతున్న ధర్నాకు సంఘీభావంగా సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలు, ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్ ,శ్రీను, లింగంపల్లి లాలయ్య, వెంకటరమణ, శేఖర్, రమావత్ రాజు ,నరసింహ, మారయ్య, రవి ,వీరబాబు ,నాగరాజు, సురేష్, వెంకన్న, కష్ణయ్య, వీరయ్య ,తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్ కోరారు. చిట్యాలలో బుధవారం సీఐటీయు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘంల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు అరూరి శీను, కత్తుల లింగస్వామి, ఐతరాజు నర్సింహ, జిట్ట సరోజ, రమాదేవి, అండాలు, కడగంచి నర్సింహ, ఏళ్ళ మారయ్య, పాల లక్ష్మయ్య, ఏనుగు వెంకట్ రెడ్డి,పొట్లపల్లి నాగయ్య, జిట్ట స్వామి, ముత్తయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.