Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన భారత మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని వై జంక్షన్ నందు గల జగ్జీవన్ రామ్ విగ్రహనికి శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు , తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మెన్ తిప్పన విజయసింహ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తిరునగరు భార్గవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల పరిషద్ కార్యాలయం నందు ఎంపీపీ నూకల సరళ హనుమంత్‌రెడ్డి, ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ కుర్ర విష్ణు, చింతల వెంకటేశ్వర్లు, కొండేటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ ఆధ్వర్యంలో...
75 ఏళ్ల స్వతంత్ర భారత అవనిలో దళితులపై ఇంకా వివక్షతే కొనసాగుతుందని కెేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రేముడాల పరశురాములు అన్నారు. మహానీయుడు మాజీ ఉప ప్రధాని దళిత ముద్దుబిడ్డ జగ్జీవన్ రావు 116 వ జయంతి సందర్భంగా కెేవీపీఎస్ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బాబు జగ్జీవన్ రావు ఆశయాలని ముందుకు తీసుకు పోవాలంటే ముందుగా కుల వివక్షతను రూపుమాపాలన్నారు. ఆనాడు కార్మిక మంత్రిగా ఉండి కార్మికులకు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తే ఈనాడు బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ పని గంటలను పెంచుతూ కార్మికుల చట్టాలను తుంగలో తొక్కుతున్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంగా మారిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు కోడి రెక్క మల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు దైద దేవయ్య, బొంగరాల వెంకన్న, దైద జనార్ధన,్ ఏసుబాబు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్డ్ కులాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో...
బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాలు స్థానిక మిర్యాలగూడ షెడ్యూల్డ్ కులాల ఉద్యోగుల సంక్షేమ సంఘం డివిజన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్తు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాస్, సంగం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మాడుగుల శ్రీనివాస్ కొత్తపల్లి బాబురావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అవి గాయకులు రావిరాల అంజయ్య, ఒడిగ ఆమోస్, మిర్యాలగూడ పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు చేగుండి మురళి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు రమణాల పరశురాములు, సంఘం నాయకులు పేరపాక కష్ణ, దైద వెంకటరత్నం, గుడిపాటి శ్రీరాములు, జెట్టి దాసు, మాలోతు హనుమ, పేరం దాసు, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ, పెన్షనర్ల ఆధ్వర్యంలో...
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనిదని సీఐటీయూ జిల్లా సహయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్రెడి,్డ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు జగదీష్ చంద్రలు అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వై జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప ప్రధానిగా అనేక సేవలు అందించారన్నారు. దేశ అభివద్ధిలో ఆయన పాత్ర కీలక మన్నారు. ఆయన చూపిన మార్గాన్ని ఎంచుకొని ఆయన ఆశయ సాధన కోసం కషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు రాగిరెడ్డి మంగా రెడ్డి, పెన్షనర్ల సంఘం జిల్లా నాయకులు వాడపల్లి రమేష్, పల్లా బిక్షం, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్ : డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ సమ సమాజ స్థాపన కోసం కషి చేసిన మహానుభావులలో ఒకరిగా ఉన్నారని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాలలో బుధవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి సభకు ఆయన హాజరై మాట్లాడారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు అరూరి శీను, జిట్ట సరోజ, కత్తుల లింగస్వామి, ఐతరాజు నర్సింహ, పాల లక్ష్మయ్య, అండాలు, శోభ, కడగంచి నర్సింహ, ఏళ్ళ మారయ్య, స్వామి, ఇందిరమ్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
శివనేనిగూడెంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, గ్రామశాఖ నాయకులు చొప్పరి లింగయ్య, పాలమాకుల అర్జున్, వెంకట్‌రెడ్డి, పోతులూరి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ : బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతిని పురస్కరించుకొని నకిరేకల్ పట్టణంలోని ఆయన విగ్రహానికి వివిధ పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.
గొప్ప దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్ : వేముల
భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రావు జీవితం స్ఫూర్తిదాయకమని దళిత సమాజ అభివద్ధి కోసం ఆయన చేసిన సేవలు గొప్పవని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కొనియాడారు. బుధవారం జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పూజర్ల శంభయ్య, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ ఆధ్వర్యంలో...
జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని కేవీపీఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు ఒంటెపాక కష్ణ, నాయకులు ఒంటెపాక వెంకటేశ్వర్లు, ఏర్పుల రాజేశ్వర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు రాచకొండ వెంకట్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ కలెక్టరేట్ : డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి జిల్లా అదనపు కలెక్టర్లు భాస్కరరావు, ఖుష్భు గుప్తా పూలమాల వేసి ఘనంగా నివాళులు నడిపించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : విద్యార్థులు అధ్యాపకులు మహనీయుల చరిత్రని అధ్యయనం చేసి వారి నుంచి స్ఫూర్తిని పొంది భవిష్యత్తుకి బాటలు బాటలు వేయాలని. మహాత్మ గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సిహెచ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎస్సీ ఎస్టీ సెల్ ఎన్ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ చిత్రపటానికి పూలమాల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కష్ణారావు, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ఎన్ఎస్ఎస్ సెల్లు డైరెక్టర్ డాక్టర్ మద్దిలేటి, ఆచార్య అల్వాల రవి, హాస్టల్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్ సాగర్ గణిత విభాగ అధిపతి డాక్టర్ హైమావతి ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ సైదులు గారు డాక్టర్ మచ్చెందర్ , ఇతర అధ్యాపక బందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.