Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజరు అడ్డంగా దొరికాడు
- రాక్షస క్రీడల్లో భాగంగా పేపర్ లీకేజీలు
- ఇది దేశంలో బీజేపీకే సాధ్యం
- విలేకరుల సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్రంలో కల్లోలం సృష్టించడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ పేపర్ లీకేజీలకు పాల్పడుతుందని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయా ందోళనకు గు రవుతున్నారని ఇది ముమ్మాటికి బీజేపీ కుట్రేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీలు బీజేపీ కుట్రలో భాగంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు ఒక అనుచరున్ని పంపి, మైనర్ బాలుని ద్వారా పేపర్ లీకేజీకి పాల్పడి బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాల నాయకులతో యూనివర్సిటీలకు చేరవేసి వాట్సాప్‌ల ద్వారా ప్రచారం చేయాలని, మీడియాకు ఫోన్ చేసి క్లిప్పింగ్‌లు వేయాలని చెప్పడంతో అడ్డంగా దొరికిపోయాడని, అందుకే అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఎక్కడో ఓచోట పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేమనే భయంతో పేపర్ లీకేజీలు జరిగాయే తప్ప మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాం చేయాలనే రాక్షస క్రీడల్లో భాగంగా పేపర్ లీకేజ్‌లకు పాల్పడుతున్నారని, ఇది దేశంలో బీజేపీకే సాధ్యమైందని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో అరెస్ట్ అయిన నిందితుడు బీజేపీకి సంబంధించిన వ్యక్తి అని, పదవ తరగతి మొదటి పరీక్ష లీకేజీకి సంబంధించి బీజేపీ అనుబంధ సంఘాలకు సంబంధించిన వ్యక్తి అని తెలిసిన ఎలాంటి రాజకీయ ఆరోపణలు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్‌పై చూపిస్తున్న అభిమానం, బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు వస్తున్న ఆదరణను చూసి రాష్ట్రంలో కల్లోలం సష్టించడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుందని ప్రజలు గమనించాలన్నారు. ఇంత జరిగిన తప్పించుకోవాలని చూస్తే తెలంగాణ ప్రజల ముందు నవ్వుల పాలు కాక తప్పదన్నారు. పేపర్ లీకేజ్‌ల సంఘటనలు బీజేపీకి సంబంధం లేనట్లయితే బండి సంజరుని పార్టీ అధ్యక్ష పదవి నుండి తక్షణం తొలగించాలని, వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.