Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన స్ఫూర్తి దేశానికి మార్గదర్శనం
- మంత్రి జగదీశ్‌రెడ్డి
- నల్లగొండలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
- నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
భారతదేశ మాజీ ఉప ప్రధాని, బాబు జగ్జీవన్ రామ్‌ను ఏ ఒక్కరికో పరిమితము చేయొద్దని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. నవభారత నిర్మాణంలో ఆయన ఒక శిల్పి అని ఆయన సేవలను కొనియాడారు. దివంగత బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతిని పురస్కరించుకుని బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా రూపొందించిన బాబు జగ్జీవన్ రామ్, తెలంగాణ తల్లి నిలువెత్తు కాంస్య విగ్రహాలను మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఆయన స్ఫూర్తి దేశానికి మార్గదర్శనం అయ్యిందన్నారు. అటువంటి చిరస్మరణీయుల చరిత్ర వర్తమానానినికి అందించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. చదువుతోటే పురోగతి సాధ్యం అని మొదట గుర్తించింది పూలే అని ఆ విధానాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్‌లు ముందుకు తీసుకు వెళ్లారని ఆయన గుర్తుచేశారు. అనంతరం కెేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు మనుస్మతిని ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దళితులను చదువులకు దూరంగా చేసి, ఊరికి దూరంగా ఉంచి అంటరానితనాన్ని పాటించిందని, మహిళలను రెండవ పౌరులుగా చూసిందని ఎలాంటి హక్కులు లేకుండా చేసిన మనస్మతికి వ్యతిరేకంగా నాడు మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్‌లు పోరాటం చేస్తే నేడు మరో మారు ప్రజలు, దళితులు, మేధావులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మనువాద స్మతిని అడ్డం పెట్టుకొని ఆర్ఎస్ఎస్ వాదులు భారత రాజ్యాంగాన్ని తొలగించే కుట్ర చేస్తుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వినరు కష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి, స్థానిక శాసన సభ్యులు కంచర్ల కష్ణారెడ్డి, గ్రంధాలయ చైర్మెన్ రెగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ బొర్ర సుధాకర్, కవి, రచయిత విశ్రాంత ఇంజినీర్ దున్న యాదగిరి, ఎస్పీ అపూర్వరావు, వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ, బొల్లు రవీందర్, దళిత నాయకులు బకరం శ్రీనివాస్, మారపాటి భిక్షమయ్య, అద్దంకి రవీందర్, గోలి ఏడుకొండలు, పందుల సైదులు, బొలుగురి నరసింహ, కత్తుల షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో స్టడీ సర్కిల్ ఏర్పాటు....
దళిత విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని దళిత సంఘాల నాయకులు మంత్రి జగదీశ్‌రెడ్డిని కోరగా తక్షణ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి నెల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.