Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిహద్దు దాటుతున్న ధాన్యం
- తక్కువ ధరకు కొని రవాణా చేస్తున్న దళారులు
- తక్కువ ధరకే కొంటున్న మిల్లర్లు
- స్థానిక పంటకు తగ్గుతున్న డిమాండ్
- ధర తగ్గించి కొంటున్న మిల్లర్ల
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఆసియా ఖండంలోని రెండో స్థానంలో ఉన్న మిర్యాలగూడ రైస్ ఇండిస్టీకు ఇతర ప్రాంతాలను పెద్ద ఎత్తున ధాన్యం తరలివస్తుంది. ఇతర రాష్ట్రాల నుండి, తెలంగాణలోని ఇతర జిల్లాలో నుంచి ధాన్యం లారీల్లో తరలిరావడంతో ఇక్కడ పండించిన పంటకు డిమాండ్ తగ్గి ధర తగ్గుతుంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ యాసంగి సీజన్లో పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. ప్రధానంగా సన్న రకాలైన అంకుర్ పూజ, హెచ్ఎంటి, చింట్లు, తెలంగాణ సోనా, ఎన్‌ఎల్‌ఆర్ వంటి సన్న రకాల ధాన్యాన్ని పండించారు. సకాలంలో పుష్కలంగా సాగునీరు అందింది. ఈ సీజన్లో చీడపీడలు, దోమకాటు, తెగుళ్లు బెడద లేకపోవడంతో పెట్టుబడులు కూడా చాలా వరకు తగ్గాయి. అంతేకాకుండా ఎకరాకు 36 బస్తాలకు తగ్గకుండా పంట దిగుబడి వచ్చింది. మిల్లర్లు సైతం సన్న రకం ధాన్యానికి మద్దతుకు మించి అదనంగా 240 నుండి 340 వరకు ధర వెచ్చించి కొనుగోలు చేశారు. పక్షం రోజులుగా ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతున్నడం ధర అధికంగా రావడంతో రైతులు సంబరపడ్డారు. ధర అధికంగా వస్తుందని ఆశించిన రైతుల ఆశలు కొన్ని రోజులకే ఆవిరి అయిపోయాయి. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ధాన్యం మిర్యాలగూడకు రావడంతో ఆ ధాన్యం తక్కువ ధరకు మిల్లర్లకు అందుతునడంతో వాటిని కొనందుకే పిల్లలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇక్కడ పండించిన పంటకు డిమాండ్ తగ్గి ధర ఒకసారిగా పడిపోయింది. మిల్లర్లు సిండికేట్ గా మారి ఒక్కసారిగా ధరను 150 నుండి 200 రూపాయలకు తగ్గించేశారు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకను అరికట్టేందుకు రాష్ట్ర సరిహద్దు అయిన వాడపల్లి వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణలోని ఇతర జిల్లాల నుండి వచ్చే దాన్యాన్ని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు.
లారీల్లో ధాన్యం తరలిస్తున్న దళారులు
ఆంధ్ర రాష్ట్రం తో పాటు తెలంగాణలోని నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ జిల్లాలలో సర రకం ధాన్యాన్ని పెద్ద ఎత్తున పండించారు. ఆ ప్రాంతాలలో రైస్ ఇండిస్టీ అంతగా లేకపోవడంతో ధాన్యాన్ని అమ్ముకునేందుకు అక్కడి రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ప్రధానంగా చింట్లు, ఎన్‌ఎల్‌ఆర్, తెలంగాణ సోనా వంటి సన్నరకం దానాన్ని అధికంగా పండించారు ధాన్యాన్ని స్థానికంగా ఉన్న దళారులు క్వింటాల్‌కు 1400, 1500 రూపాయలు చొప్పున కొనుగోలు చేసి లారీల్లో నింపి మిర్యాలగూడకు తరలిస్తున్నారు. రవాణా హామాలు చార్జీలు పోను క్వింటాలకు 200 నుంచి 400 రూపాయలు వరకు మిగులుబాటు అయ్యే విధంగా చూసుకొని దళారులు ధాన్యాన్ని తక్కువ ధరకు 2200 మించకుండా అమ్ముతున్నారు. అలా అమ్మిన క్వింటాల్‌కు 200 నుంచి 400 రూపాయల వరకు దళారికి లాభం వస్తుంది. దీంతో తక్కువ ధరకే సన్న రకం ధాన్యం రావడంతో స్థానిక ధాన్యానికి బదులు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా పండించిన ధాన్యానికి అమాంతంగా ఒక్కసారిగా ధర పడిపోయింది.
పేరుకే చెక్ పోస్ట్‌లు, తనిఖీలు
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకున్నందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు నామమాత్రంగానే ఉంటున్నాయి. అక్కడ విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది చేతివాటానికి అలవాటు పడి రాత్రి వేళలో లారీలను మిర్యాలగూడ కు వచ్చేందుకు అనుమతిస్తున్నట్ల గతంలో ఆరోపణలు వినిపించాయి. ఆ కోణంలోనే గత సీజన్లో వందలాది లారీల ధాన్యం ఆంధ్ర రాష్ట్రం నుంచి తరలివచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ సీజన్లో సైతం ముందస్తుగా వాడపల్లి వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం రాకుండా ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి మరి. మరోపక్క తెలంగాణ లోని ఇతర జిల్లాల నుంచి ధాన్యం పెద్ద ఎత్తున వస్తున్న దాన్ని అడ్డుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ముందుగా స్థానికంగా పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసిన తర్వాతనే ఇతర ప్రాంతాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అప్పుడు మాత్రమే ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుందని రైతు ప్రతినిధులు పేర్కొంటున్నారు.
ధాన్యం రాకుండా అడ్డుకోవాలి
వీరేపల్లి వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు
రైస్ ఇండిస్టీలో పేరుగాంచిన మిర్యాలగూడలో ప్రతి సీజన్లో ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లా నుండి పెద్ద ఎత్తున ధాన్యం వస్తుంది. అక్కడి దాన్యం తక్కువ ధరకు రావడం వల్ల మిల్లర్లు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇక్కడ పండించిన ధాన్యానికి ధర సరిగా రావడం లేదు. ఇతర ప్రాంతాన్నించే ధాన్యాన్ని పూర్తిగా అరికట్టాలి ముందుగా స్థానిక ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసిన తర్వాతనే ఇతర ప్రాంతాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఆ విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
బియ్యం ధరలు తగ్గడంతో ధాన్యం ధర తగ్గింది
గౌరు శ్రీనివాస్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పడిపోయాయి క్వింటాల్‌కు 200 నుంచి 400 రూపాయలు ధర తగ్గింది దాని ఫలితంగా ధాన్యం ధర తగ్గింది. నాణ్యమైన ధాన్యానికి ఇప్పటివరకు అత్యధికంగా 2400 ధర పెట్టాం. బియ్యం ధరలు తగ్గడంతో 50 నుంచి 100 రూపాయల వరకు తక్కువ చేయాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రాంతం నుంచి ఎలాంటి దాన్యం రావడం లేదు.
పకడ్బందీగా ధాన్యం రాకను అడ్డుకుంటాం
డీఎస్ఓ వెంకటేశ్వర్లు
ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా పూర్తిగా అడ్డుకుంటాం. ఇప్పుడు వరకు ధాన్యం ఇంకా రాలేదు ముందస్తుగానే ధాన్యాన్ని రాకను అడ్డుకునేందుకు వాడపల్లి వద్ద చెక్‌పోస్ట్ ను ఏర్పాటు చేశాం రెవెన్యూ పోలీస్ వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ అధికారులతో మూడు టీమ్‌లను ఏర్పాటు చేశాం షిఫ్టులు వారిగా వారు విధులు నిర్వహిస్తారు. ధాన్యం రాకను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.