Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటమాడతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణను అభివద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను చూసి ఓర్వలేకే బీజేపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారన్నారు. బీజేపీ కార్యకర్తల ద్వారానే పేపర్ లీకేజీ జరిగిందన్నారు. పేపర్ లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు కుట్రదారుడని తెలిపారు. బీజేపీ కులం, మతం అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి బీజేపీ అనేక కుట్రలకు పాల్పడుతుందన్నారు. బీఆర్ఎస్తో పోటీ పడలేక బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్కు ప్రజలు పెద్ద ఎత్తున ఆదరణ చూపుతున్నారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీతో సంబంధమున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరును పార్టీ అధ్యక్ష పదవి నుండి సస్పెండ్ చేయాలన్నారు. బండి సంజరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి ప్రజలు తగిన బుద్దిచెప్తారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్, సింగిల్‌విండో చైర్మెన్లు వెన్‌రెడ్డి రాజు, చింతల దామోదర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాస్, మాజీ మార్కెట్‌కమిటీ చైర్మెన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వీరమల్ల వెంకటేశ్‌గౌడ్, గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్ ఉన్నారు.