Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్ అని ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక కొత్తబస్టాండ్ వద్ద గల విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
భారతదేశంలో వలసవాదానికి, సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్రోద్యమ పోరాటంతో పాటు కుల నిర్మూలన, సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో కీలకంగా పని చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన అన్నారు. భారత దేశ స్వరాజ్య ఉద్యమంతో పాటు తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన ఆయన జీవితం రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నదని కొనియాడారు.బాబూజీ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతత్వంలో ని తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. దేశమే ఆశ్చర్యపోయే రీతిలో ఫలితాలు సాధిస్తున్నాం అన్నారు..ఎక్కడా లేని విధంగా తెచ్చిన దళితబంధు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. జగ్జీవన్ ఆశయ సాధన కు మనమంతా కషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపు నిచ్చారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్, మునిసిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జెడ్పిటిసి జీడి బిక్షం లు మాట్లాడుతూ 116వ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు, నేటి సమాజానికి ఆయన జీవితం స్ఫూర్తి దాయకమని తెలిపారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా కులాంతర వివాహాలు చేసుకున్న 50 జంటలకు ప్రోత్సహకం కింద కోటి రూపాయలను నగదు చెక్కు లను మంత్రి అందజేశారు.ఈ కార్యక్రమంలో డిసియంయస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్,జిల్లా గ్రంధాలయా చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,అదనపు కలెక్టర్ మోహన్ రావు,మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, గుద్దేటి ఎల్లయ్య మాదిగ,తప్పెట్ల శ్రీరాములు, చిన్న శ్రీరాములు, తల్లమళ్ల హస్సన్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్‌రామ్
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి
భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త రాజకీయ వేత్త బాబు జగ్జీవన్ రావ్ అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బాబు జగ్జీవన్ రావ్ 116వ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక ఎం వి ఎన్ భవన్లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ రాష్ట్రం లోని జన్మించిన బాబు జగ్జీవన్ రావ్ తాను స్వయంగా కుల వివక్షను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. పాఠశాలలో హిందువులకు, ముస్లింలకు, వెనుకబడిన వర్గాలకు వేరు వేరుగా మంచి నీటి కుండలను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించి కుండను పగులగొట్టి పాఠశాల స్థాయిలోనే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, ప్రజాసంఘాల నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, దీరావత్ రవి నాయక్, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మట్టిపల్లి సైదులు,వేల్పుల వెంకన్న,మేకన బోయిన సైదమ్మ,ధనియాకుల శ్రీకాంత్, కొప్పుల రజిత,పల్లె వెంకటరెడ్డి, వట్టేపు సైదులు, దేవరం వెంకటరెడ్డి, మిట్టగడుపుల ముత్యాలు, చినపంగి నరసయ్య,పులుసు సత్యం,కందాల శంకర్ రెడ్డి,దుగ్గి బ్రహ్మం, రణపంగ కష్ణ, రాపోలు సూర్యనారాయణ, భాస్కర్, ఉప్పలయ్య, హుస్సేన్, వజ్జే శ్రీను,బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల గొంతుక జగ్జీవన్ రామ్
మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగ్జీవన్ రామ్ అని ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.బాబూ జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక మునిసిపాలిటీ కార్యాలయంలో అయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ రామానుజు లారెడ్డి,వార్డు కౌన్సిలర్లు అనంతుల యాదగిరి, విక్రమ్,జ్యోతి శ్రీవిద్య, సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ,భరత్, పూర్ణ శశికాంత్,ఈ ఈ జి డి కె ప్రసాద్, డి ఈ సత్య రావు, ఆర్ ఐ శివరాంరెడ్డి, ఇంజనీరింగ్ సెక్షన్ ఎస్ ఎస్ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మరువలేనిది
అట్టడుగు వర్గాల అభ్యున్నతి,అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం డా బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మరువలేనిదని టీఎస్యూటీఎఫ్్ జిల్లా అధ్యక్షులు ఎన్.సోమయ్య అన్నారు.బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక సంఘం కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లాకోశాధికారి జి.వెంకటయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు జె.యాకయ్య,జిల్లాకార్య దర్శులు ఎస్. కె.సయ్యద్ బి.పాపిరెడ్డి,రమేష్,బి. ఆడమ్, ఆడిట్ కమిటీ సభ్యులు పల్లె.అనిల్ కుమార్,చిలక.రమేష్, కన్వీనర్ డి.లాలు, డి.శ్రీనివాసా చారీ, ఆర్.శ్రీను, డి.బాలాజీ,బి.ఆనంద్,ఎన్. సైదా, వై.లింగయ్య, అల్లి.నాగయ్య, ఎం.యాదయ్య,చల్లా. వెంకటేశ్వర్లు, ఎస్.అంజయ్య,ఎడ్ల.గోపయ్య, జె.జానయ్య తదితరులు పాల్గొన్నారు.