Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నాగారం
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి శూన్యమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో 600 రూపాయల ఆసరా పెన్షన్ కేసీిఆర్ ప్రభుత్వం 2000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఊసే లేదన్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ దేశానికి దిక్సూచి లాగా ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నారని తెలిపారు. ప్రజలందరూ ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంట నడవాలని సూచించారు. అంతకుముందు నాగారం మండల ప్రజలు ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా వస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్‌ను బతుకమ్మ, బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ గుజ్జ దీపిక యుగంధర్, తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మినేని స్రవంతి సతీష్, వైస్ చైర్మన్ యరాల రామ్‌రెడ్డి, ఎంపీపీ కూరము మనీ వెంకన్న, వైస్ ఎంపీపీ గుంతకండ్ల మణిమాల, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండ గాని అంబయ్య వడ్డే పరశురాములు, పొదిల రమేష్, కుంభం కరుణాకర్, వేల్పుల సాలయ్య, కేశగాని అంజయ్య, ఈదుల కిరణ్, దోమల బాలమల్లు, తరాల ఆంజనేయులు, యారాల నరసింహారెడ్డి, పేరాల యాదగిరి, చిరంజీవి, చిల్లర చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.