Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూర్నగర్:పట్టణంలోని ఎండీఆర్ హైస్కూల్లో బుధవారం పాఠశాలలో చదివే విద్యార్థులో ఆరోగ్యంగా ఉండాలనే దష్టితో డాక్టర్ రాకేష్ డీసీిహెచ్ ఎఫ్ఎండీ తెలంగాణ హాస్పిటల్ వారిచే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు పాఠశాల కరస్పాండెంట్, చైర్మెన్ మేరెడ్డి దామోదర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యతోపాటు ఆరోగ్యం కూడా అంతే అవసరమని భావించి విద్యార్థులు పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలనే భావనతో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రిన్సిపల్ నలబోలు భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నట్లయితేనే బోధించే విద్యను సక్రమంగా అర్థం చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారన్నారు. డాక్టర్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలల్లో ఇటువంటి క్యాంపులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు వచ్చే జబ్బులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నయం చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏవో నర్సిరెడ్డి, రణబోతు వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.